Viral Video: “జై శ్రీరాం అను” అంటూ అమెరికా గాయని, నటి సెలీనా గోమెజ్‌ను కోరిన యువకుడు

సెలీనా గోమెజ్‌ను జైశ్రీరాం అనాలని ఆ యువకుడు కోరడం పట్ల సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది.

అమెరికా గాయని, నటి సెలీనా గోమెజ్‌ను కలిసిన ఓ భారతీయ అభిమాని ఆమెను జై శ్రీరాం అనాలని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫొటోగ్రాఫర్ పల్లవ్ పాలివాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.

సెలీనా గోమెజ్‌ను కలిసిన ఓ భారతీయ యువకుడు ఆమెతో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ సమయంలో ఆమెను జై శ్రీరాం అనాలని కోరాడు. జైశ్రీరాం అంటే ఏంటి? అని సెలీనా ప్రశ్నించడంతో.. ఆమెతో ఆమె యువకుడు.. “జైశ్రీరాం ఓ పాపులరర్ హిందూ నినాదం” అని చెప్పాడు. అనంతరం సెలీనా గోమెజ్‌ను ఆ నినాదం చేయకుండా సున్నితంగా నో చెప్పింది. “థ్యాంక్యూ హనీ” అని ఆ యువకుడితో అంది.

సెలీనా గోమెజ్‌ను జైశ్రీరాం అనాలని ఆ యువకుడు కోరడం పట్ల సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. అప్పట్లో నమస్తే అనాలని సెలబ్రిటీలను కోరేవారని, ఇప్పుడు జై శ్రీరాం అనాలని కోరుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. సెలబ్రిటీలతో మతానికి సంబంధించిన నినాదాలు చేయించాలనుకోవడం ఏంటని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ యువకుడు అడిగినదాంట్లో తప్పేమీ లేదని కొందరు కామెంట్లు చేశారు.

దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం: నారా లోకేశ్