Israel-Palestine war
Israel: ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు సురక్షితంగానే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్లో ఉంటున్న, పనిచేస్తున్న భారతీయుల పట్ల ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ పాల్పడలేదని తెలిసింది.
అలాగే, ఇజ్రాయెల్ నుంచి భారత్ కు వచ్చేందుకు సాయం చేయాలని మన దేశానికి చెందిన టూరిస్టులు, పౌరుల నుంచి టెల్ అవివ్-యాఫోలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తులు వచ్చాయి. హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన వారు ఇజ్రాయెల్ లో భీకర దాడులు చేస్తుండడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.
ఇజ్రాయెల్ లో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,900 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇజ్రాయెల్ లో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారు. వారిలో టూరిస్టుల్లోని చాలా మంది గ్రూపులుగా తిరుగుతున్నారు. అలాగే, కొందరు వ్యాపారవేత్తలు కూడా ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయారు.
వారి నుంచి కూడా టెల్ అవివ్-యాఫోలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తులు వచ్చాయి. కాగా, ఇజ్రాయెల్ లో నివసిస్తున్న భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక సూచన చేసింది. జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారుల భద్రతా ప్రోటోకాల్ లను పాటించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి భారత్ సూచించింది.
Israel : ఇజ్రాయెల్ నుంచి షాకింగ్ వీడియో.. బందీగా కుటుంబం.. కళ్లముందే కూతురికి ఉరి..