Indian Navy MR Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… పది పాస్ అయితే చాలు, ప్రభుత్వ ఉద్యోగాలు

అక్టోబర్ 2021లో ప్రారంభమయ్యే మెట్రిక్ రిక్రూట్ బ్యాచ్ కోసం ఇండియన్ నేవీ దరఖాస్తులో కోరుతోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

Indian Navy MR Recruitment : అక్టోబర్ 2021లో ప్రారంభమయ్యే మెట్రిక్ రిక్రూట్ బ్యాచ్ కోసం ఇండియన్ నేవీ దరఖాస్తులో కోరుతోంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. చెఫ్, స్టీవార్డ్, హైజీనిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ తో భర్తీ చేయనుంది. పదో తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూలై 23లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

* మొత్తం పోస్టులు : 350
* అభ్యర్థులు రాతపరీక్ష సమయంలో కొవిడ్ నెగిటివ్ రిపోర్టు మస్ట్ గా సబ్మిట్ చేయాలి
* ఇండియన్ నేవీ ఎంఆర్ రిక్రూట్ మెంట్ 2021 జూలై 19 నుంచి మొదలవుతుంది.
* దరఖాస్తుకు చివరి తేదీ జూలై 23

భర్తీ చేసే పోస్టులు:
సెయిలర్స్ ఫర్ మెట్రిక్ రిక్రూట్
అర్హత : టెన్త్ పాస్ అయి ఉండాలి
చెఫ్ : అభ్యర్థి మెనూ ప్రకారం ఫుడ్ చేయగలగాలి(వెజ్, నాన్ వెజ్). వంట చేయడంతో పాటు ఇతర పనులు చేయాల్సి ఉంటుంది.

స్టీవార్డ్ : ఆఫీసర్స్ మెసెస్ లో ఫుడ్ సెర్వ్ చేయాల్సి ఉంటుంది. వెయిటర్స్, హౌస్ కీపింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే స్టోర్ కీపర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. వాటితో పాటు ఇతర విధులు అప్పగిస్తారు.
హైజినిస్ట్: వాష్ రూమ్స్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇతర పనులు కూడా అప్పగిస్తారు.
అభ్యర్థులు 01 ఏప్రిల్ 2001 నుంచి 30 సెప్టెంబర్ 2004 మధ్య జన్మించి ఉండాలి.
ట్రైనింగ్ పీరియడ్ లో నెలకు రూ.14వేల 600 స్టైపండ్ గా ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మూడు లెవెల్స్ లో నియమిస్తారు. జీతం రూ. 21వేల 700 నుంచి రూ.69వేల 100 వరకు ఉంటుంది.
రాత పరీక్ష ద్వారా ఎంపిక
పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in. వెబ్ సైట్ ను చూడాలి.

ట్రెండింగ్ వార్తలు