వావ్..యువ ఫోటోగ్రాఫర్ మైక్రో ఫోటోస్..చూస్తే కళ్లు తిప్పుకోలేరు

ఫోటో..! ఒక జ్నాపకాల దొంతర. ఒక అనుభూతి. అంతేకాదు..కొన్ని ఫోటోలు ఆలోచింపజేస్తాయి. ఎన్నో చేదు..తీపి జ్నాపకాలను ఫోటోలు గుర్తు చేస్తాయి. మరికొన్ని ఫోటోలు ఎన్నో పరిస్థితులను కళ్లకు కడతాయి. ఇంకొన్ని ఫోటోలు మనస్సును కదిలిస్తాయి. ఆలోచింపజేస్తాయి. అనుభూతిని కలిగిస్తాయి. వందలు..వేల మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫోటోతో చెప్పొచ్చు. ఇలా ఫోటోల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. పదాలు చాలవు. ఫోటోలు తీయటం ఒక కళ. ఫోటోలు తీయటంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు శశికుమార్ అనే యువ ఫోటో గ్రాఫర్.
ప్రకృతితో మమేకమవుతు శశికుమార్ తీసే ఫోటోలు చూస్తే కళ్లార్పకుండా చూడాల్సిందే. తన స్మార్ట్ ఫోన్ తో ఫోటోలు తీస్తూ చక్కటి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు శశికుమార్. శశికుమార్ తన ఫోటో గ్రఫీ కోసం రెండు స్మార్ ఫోన్ యూజ్ చేసి తీసిన ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు.
వెల్లూరులోని యూనివర్శిటీలో చదువుకుంటున్న 20 ఏళ్ల శిశికుమార్ కు ఫోటో గ్రఫీ అంటే ప్రాణం. ఫోటోలు తీయటానికి తన ఫోన్లతో పొలాల వెంటా..ఖాళీ స్థలాల వెంటా తిరుగుతుంటాడు. ప్రకృతితో మమేకమవుతూ..చిట్టి చిట్టి కీటకాలను..అవి చేసే పనులను తన కెమెరాల్లో బంధిస్తుంటాడు శశికుమార్. కీటకాలను ఫోటోలు తీయటానికి శశి తన ఫ్రెండ్స్ చక్కటి సహకారాన్ని అందిస్తుంటారు. మరి ఈ ఔత్సాహిక యువ ఫోటో గ్రాఫర్ తీసిన చక్కటి..ఫోటోలను చూడండీ..
ఇది రాజమౌళి ‘ఈగ’ కాదు శశికుమార్ ‘ఈగ’..
చీమల చైన్ తో చీమలు చెప్పే నీతి: ఎంత సహకారమో చూడండీ..ఇది శశికుమార్ ఫోటో టాలెంట్
వావ్..చిన్ని కొమ్మపై చీమ సింగిల్ కాలితో చేసే సర్కస్ భలేగుంది కదూ..
బాహుబలి చీమ : చనిపోయిన సాలీడును మోసుకెళుతున్న చిన్న చీమ..అదికూడా రెండు కాళ్లతో..వాటే వండర్..
శశికుమార్ టాలెంట్ కు అద్ధంపడుతున్న మరిన్ని మైక్రో ఫోటోస్..