Rahul Gandhi : సోదరి ప్రియాంకను తన బైక్‌పై ఎక్కించుకుని రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ.. వీడియో వైరల్..
Rahul Gandhi : ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా బుధవారం రాహుల్ గాంధీ ముజఫర్‌పుర్‌లో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, తన సోదరి

Rahul Gandhi
Rahul Gandhi : బీహార్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. మరికొన్ని నెలల్లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారపర్వంపై దృష్టిసారించాయి. అయితే, కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు.
Also Read: PM Modi Degree Row: ప్రధాని మోదీ డిగ్రీ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు.. ఆ ఆదేశాలు కొట్టివేత..
ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా బుధవారం రాహుల్ గాంధీ ముజఫర్‌పుర్‌లో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను బైక్ పై ఎంచుకొని రైడ్ చేశారు. అంతకుముందు ప్రియాంక గాంధీ తలకు స్వయంగా రాహుల్ గాంధీ హెల్మెంట్ పెట్టారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఒకే బైక్ పై ర్యాలీలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
— Congress (@INCIndia) August 27, 2025
ఆగస్టు 17న బీహార్ లోని ససారామ్ లో ప్రారంభమైన ఈ ఓటర్ అధికార్ యాత్ర 1300 కిలో మీటర్ల మేర సాగి.. సెప్టెంబర్ 1వ తేదీన ముగుస్తుంది. ఈ బైక్ ర్యాలీలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ తోపాటు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఇదిలాఉంటే.. ఈ ర్యాలీలో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
View this post on Instagram