Indian Cricketrs : కేంద్రం భారీ దెబ్బ.. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు రూ.200 కోట్ల నష్టం..
Indian Cricketrs : కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బిల్లుతో టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ సహా

Indian Crickets Lose
Indian Cricketrs : కేంద్రం ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన బిల్లుతో టీమిండియా దిగ్గజ ప్లేయర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఆర్థికంగా భారీ దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో బీసీసీఐపైనే కాకుండా భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్లపై కూడా ఎఫెక్ట్ పడనుంది. (Indian Cricketrs)
Also Read: Ashwin : ఇదేం సిత్రమో.. అశ్విన్ మొదటి, ఆఖరి ఐపీఎల్ వికెట్లు ఒకే రోజున ఇంకా..
డబ్బుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణను నిషేధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో భారత క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 తన ఒప్పందం నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీనిద్వారా బీసీసీఐకు దాదాపు రూ.125కోట్లు వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే, బీసీసీఐతో పాటు భారత జట్టు మాజీ, తాజా ఆటగాళ్లకు కేంద్రం తీసుకొచ్చిన బిల్లుతో ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది.
ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణను నిషేధించే బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తరువాత క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. భారత జట్టులోని తాజా, మాజీ ఆటగాళ్లు ఆర్థికంగా భారీగా నష్టపోతారని తెలిపింది. ఈ మొత్తం దాదాపు రూ.150 కోట్లు నుంచి రూ.200 కోట్ల వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది.
గేమింగ్ యాప్‌లకు ప్రమోషన్స్‌తో క్రికెటర్లు ప్రతీయేటా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంపీఎల్‌తో తన ఒప్పందం ద్వారా సంవత్సరానికి 10 నుంచి 12కోట్ల వరకు తీసుకుంటున్నాడు. డ్రీమ్ 11, విన్జో నుంచి రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలు సంవత్సరానికి సుమారు రూ.6కోట్ల నుంచి రూ.7కోట్ల వరకు అందుకుంటున్నారు. ఆయా సంస్థల ద్వారా మిగిలిన ఆటగాళ్లు రూ.కోటి లేదా అంతకంటే తక్కువ మొత్తాన్ని ఏడాదికి అందుకుంటున్నారు. అయితే, అటగాళ్లందరూ కలిపి ప్రతీయేటా రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఈ యాప్‌ల ప్రమోషన్ల ద్వారా అందుకుంటున్నారట. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు నేపథ్యంలో ఆ మొత్తంను ఆటగాళ్లు నష్టపోనున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ నిషేధం బిల్లుతో అడ్వటైజ్మెంట్ మార్కెట్‌కు కూడా భారీ దెబ్బగా చెబుతున్నారు. ఈ కేటగిరిలో 7నుంచి 8 శాతం ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా జరుగుతుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఇది సంవత్సరానికి 8వేల కోట్ల నుంచి 10వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది డిజిటల్ ప్రకటనల మార్కెట్లో 15శాతం 20 శాతం వాటా కలిగి ఉంటుందని ఎలారా క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్ కరణ్ తౌరాని తెలిపారు.