IND vs AUS 2nd T20 : అభిషేక్ శర్మ మినహా చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ఆసీస్ ముందు (IND vs AUS 2nd T20) 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
 
                            IND vs AUS 2nd T20 team india all out 125 australia target is 126
IND vs AUS 2nd T20 : మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. దీంతో టీమ్ఇండియా ఆసీస్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (68; 37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. హర్షిత్ రాణా (35; 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించాడు.
Innings Break!#TeamIndia all out for 125 runs in 18.3 overs.
Abhishek Sharma top scored with 68 runs.
Scorecard – https://t.co/ereIn74bmc #TeamIndia #AUSvIND #2ndT20I pic.twitter.com/UTG0fG8c2Y
— BCCI (@BCCI) October 31, 2025
శుభ్‌మన్ గిల్ (5), సంజూ శాంసన్ (2), సూర్యకుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0), అక్షర్ పటేల్ (7), శివమ్ దూబె (4)లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ మూడు వికెట్లు తీశాడు. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మార్కస్ స్టోయినిస్‌లు ఓ వికెట్ సాధించాడు.






