Baahubali The Epic: బాహుబలి ఎపిక్ విడుదల.. ఆగ్రహంలో ఫ్యాన్స్.. అలా ఎలా తీసేస్తారు..

బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సంధర్బంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు మేకర్స్. (Baahubali The Epic)బాహుబలి, బాహుబలి 2 రెండు సినిమాలను కలిపి "బాహబలి ది ఎపిక్" పేరుతో విడుదల చేశారు.

Baahubali The Epic: బాహుబలి ఎపిక్ విడుదల.. ఆగ్రహంలో ఫ్యాన్స్.. అలా ఎలా తీసేస్తారు..

Sudeep fans angry over Baahubali The Epic movie

Updated On : October 31, 2025 / 3:32 PM IST

Baahubali The Epic: బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సంధర్బంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు మేకర్స్. బాహుబలి, బాహుబలి 2 రెండు సినిమాలను కలిపి “బాహబలి ది ఎపిక్” పేరుతో విడుదల చేశారు. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ (Baahubali The Epic)సినిమా. కొత్త సినిమాను విడుదల చేసిన రేంజ్ ఈ సినిమాను విడుదల చేసారు మేకర్స్. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. ఏకంగా ప్రభాస్, రాజమౌళి, రానా ఇంటర్వ్యూ ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు. అందుకే, సినిమాపై చాలా బజ్ క్రియేట్ అయ్యింది. ఆలాగే మొదటిరోజు కలెక్షన్స్ కూడా రికార్డ్ లెవల్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.

The Rajasaab: మతిపోగొడుతున్న రాజాసాబ్ లెక్కలు.. కేవలం ప్రభాస్ బ్రాండ్ మీదనే.. ఆపుతారా లేక..

అయితే, బాహుబలి రీ రిలీజ్ నేపధ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే, కన్నడ స్టార్ సుదీప్ ఫ్యాన్స్ మాత్రం కోపంగా ఉన్నారు. సినిమాపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, బాహుబలి ది ఎపిక్ సినిమాలో ఇప్పటివరకు ఆడియన్స్ నుంచి చాలా కొత్త సీన్స్ యాడ్ చేశారు. ఆలాగే చాలా సీన్స్ ని డిలిట్ చేశారు.
డిలిట్ చేసిన సీన్స్ లో కన్నడ స్టార్ సుదీప్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన అస్లామ్ ఖాన్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. చేసింది చిన్న పాత్రే అయినా సినిమాలో చాలా ఇంపాక్ట్ ఉండే పాత్ర అనే చెప్పాలి. అలాంటి పాత్రను బాహుబలి రీ రిలీజ్ కోసం ఆయన సీన్స్ ను డిలిట్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో కొన్ని నిమిషాల పాటు ఉండే సీన్స్ ను ఎందుకు డిలిట్ చేశారు. ఉన్నదే ఒక సీన్ అది కూడా ఎందుకు తీశేశారు అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక బాహుబలి ది ఎపిక్ విడుదల విషయానికి వస్తే, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. రీ రిలీజ్ లో రూ.100 కోట్లు కొట్టే మొదటి సినిమాగా బాహుబలి నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.