The Rajasaab: మతిపోగొడుతున్న రాజాసాబ్ లెక్కలు.. కేవలం ప్రభాస్ బ్రాండ్ మీదనే.. ఆపుతారా లేక..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న నెక్స్ట్ మూవీ "రాజాసాబ్". కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ(The Rajasaab) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.

The Rajasaab: మతిపోగొడుతున్న రాజాసాబ్  లెక్కలు.. కేవలం ప్రభాస్ బ్రాండ్ మీదనే.. ఆపుతారా లేక..

Prabhas Raja saab movie business crosses Rs. 180 crores in AP and Telangana

Updated On : October 31, 2025 / 2:46 PM IST

The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న నెక్స్ట్ మూవీ “రాజాసాబ్”. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. కామెడీ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో (The Rajasaab)మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం రెస్పాన్స్ రావడమే కాదు అంచనాలను కూడా ఒక రేంజ్ లో పెంచింది. ఆలాగే బిజినెస్ లెక్కలు కూడా మార్చేసింది.

Bhoomi Shetty: మహాకాళి ఫస్ట్ లుక్.. ఇంతకీ ఈ భూమి శెట్టి ఎవరు.. ప్రశాంత్ ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశాడు..

పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు మారుతీ అధికారికంగా ప్రకటించారు. అయితే, ట్రైలర్ రిలీజ్ తరువాత రాజాసాబ్ బిజినెస్ ఒక రేంజ్ లో పెరుగుతోందట. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏరియా కలిపి ఏకంగా రూ.180 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. చివరగా పుష్ప 2 సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరిగింది. మాలీ రాజాసాబ్ కే అది సాధ్యమయ్యింది.

అయితే, బిజినెస్ ఈ రేంజ్ లో జరగడానికి ప్రభాస్ బ్రాండ్ నేమ్ కారణం అని చెప్తున్నారు. రాజాసాబ్ కామెడీ అండ్ హారర్ కంటెంట్ తో వస్తున్న సినిమా. ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. కాబట్టి, రాజాసాబ్ విషయంలో అదే జరిగి కొంచం పాజిటీవ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా రూ.1000 కోట్ల మార్క్ ను ఈజీగా దాటుతుంది. అందుకే ఈ రేంజ్ లో బయ్యర్స్ ఈ సినిమాను కొనేందుకు ముందుకు వస్తున్నారట. ఇక ఈ సినిమా 2026 జనవరి 9 అంటే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక పండగ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయితే ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధించడం ఖాయం.