Bhoomi Shetty: మహాకాళి ఫస్ట్ లుక్.. ఇంతకీ ఈ భూమి శెట్టి ఎవరు.. ప్రశాంత్ ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశాడు..
టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి మంచి క్రేజ్ ఉంది. (Bhoomi Shetty)దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. హిందూ ఇతిహాసాల్లోనే ప్రముఖ పాత్రలను తీసుకొని ప్రశాంత్ ఈ కాన్సెప్ట్ ను డిజైన్ చేశాడు.
Bhoomi shetty "Mahakali" movie First look release
Bhoomi Shetty: టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి మంచి క్రేజ్ ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. హిందూ ఇతిహాసాల్లోనే ప్రముఖ పాత్రలను తీసుకొని ప్రశాంత్ ఈ కాన్సెప్ట్ ను డిజైన్ చేశాడు. ఇప్పటికే ఈ (Bhoomi Shetty)యూనివర్స్ లో భాగంగా హనుమాన్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ హీరో కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ యూనివర్స్ లో భాగంగా “మహాకాళి” అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్. లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారు అనే క్యూరియాసీటీ అందరిలోనూ నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆ ఆ క్యూరియాసిటీని రెట్టింపు చేశాడు.
Esha Rebba: వయ్యారి భామ ఈషా రెబ్బ.. శారీలో అందం అదిరిందబ్బా..
ఈ సినిమా మహాకాళి టైటిల్ పాత్రలో భూమి శెట్టి నటిస్తోందంటూ రివీల్ చేశాడు. మహాకాళిగా ఆమె లుక్ నెక్సల్ లెవల్లో ఉంది. కానీ, టాలీవుడ్ లో చాలా మందికి భూమి శెట్టి గురించి తెలియదు. దాంతో, ఎవరు ఈ భూమి శెట్టి, ప్రశాంత్ ఇంత గొప్ప అవకాశాన్ని ఆమెకు ఎందుకు ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి, కన్నడ ఇండస్ట్రీకి చెందిన భూమి శెట్టి ఒక సీరియల్ నటి. కన్నడలో వచ్చిన “కిన్నర” అనే టీవీ సీనియర్ ద్వారా ఆమె నటిగా మారింది. ఆ తరువాత తెలుగులో వచ్చిన నిన్నే పెళ్లాడుతా అనే సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది.
ఆ ఫేమ్ తోనే ఆమెకు సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి. ఆమె మొదటి సినిమా కన్నడలో విడుదల అయ్యింది. అదే ఇక్కత్. మంచి విజయం సాధించిన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయినా కూడా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది భూమి శెట్టి. ఇక తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా “షరతులు వర్తిస్తాయి”. చైతన్య రావు హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో, ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో సత్య దేవ్ భార్యగా నటించింది భూమి శెట్టి. ఇప్పుడు ఏకంగా ప్రశాంత్ వర్మ చేస్తున్న మహాకాళి సినిమాలో ప్రధాన పాత్ర చేసే అవకాశాన్ని దక్కించుకుంది. లేటెస్ట్ గా విడుదలైన మహాకాళి ఫస్ట్ లుక్ చేస్తే ఆమెను ఎందుకు సెలెక్ట్ చేశారా అని క్లియర్ గా అర్థమయ్యింది. కాళీ పాత్రలో ఆమె గంభీరంగా చాలా అద్భుతంగా కనిపించింది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి, ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగు నుంచి మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

