IND vs AUS : భారత దురదృష్టం కంటిన్యూ.. 19వ సారి టాస్ గెలిచిన మిచెల్ మార్ష్.. అర్ష్‌దీప్ సింగ్‌కు నో ప్లేస్..
మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది.
 
                            IND vs AUS 2nd T20 australia won the toss and elected to bowl
IND vs AUS : మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మిచెల్ మార్ష్ టాస్ గెలవడం ఇది 19వ సారి కాగా.. ప్రతి సారి అతడు లక్ష్య ఛేదననే ఎంచుకోవడం విశేషం.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చాలా బాగుంది. 40 ఓవర్లపాటు పిచ్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాం. తుదిజట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. జోష్ ఫిలిప్ స్థానంలో మాథ్యూ షార్ట్ వచ్చాడు.’ అని మిచెల్ మార్ష్ అన్నాడు.
🚨 Toss 🚨#TeamIndia have been put into bat first.
Updates ▶ https://t.co/7LOFHGtfXe#AUSvIND pic.twitter.com/46JjIM2YkA
— BCCI (@BCCI) October 31, 2025
‘ముందుగా బ్యాటింగ్ చేయాలని తెలియడంతో సంతోషంగా ఉన్నాం. మేము అగ్రెసివ్ క్రికెట్ ఆడుతాము. శుభ్‌మన్ గిల్‌కు పరుగులు ఎలా చేయాలో తెలుసు. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం.’ అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.
భారత తుది జట్టు..
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
The Playing XI for the 2nd #AUSvIND T20I 🙌
Updates ▶ https://t.co/7LOFHGtfXe#TeamIndia pic.twitter.com/8gAjfwoGSi
— BCCI (@BCCI) October 31, 2025






