Video: షాకింగ్.. ఇవి సాధారణ కుక్కలంటే మీరు నమ్ముతారా? నీలి రంగులోకి మారిపోయి ఇప్పుడు..

ఆ కుక్కలు వారం క్రితం సాధారణంగానే ఉన్నాయని స్థానికులు తెలిపారు. అకస్మాత్తుగా ఆ కుక్కలు రంగు మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Video: షాకింగ్.. ఇవి సాధారణ కుక్కలంటే మీరు నమ్ముతారా? నీలి రంగులోకి మారిపోయి ఇప్పుడు..

Updated On : October 31, 2025 / 2:54 PM IST

Video: యుక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్ర ప్రాంతంలో ఓ ఫొటోగ్రాఫర్ తీసిన కుక్కల ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఆ కుక్కలు నీలి రంగులో ఉండడమే దీనికి కారణం.

నీలి రంగు ముఖం, రోమాలతో ఆ కుక్కలు కనిపించాయి. ఈ ఫొటోలను డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ అనే సంస్థ షేర్ చేసింది. 1986లో చెర్నోబిల్‌లో అణు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత అక్కడి కుక్కలు దాని ప్రభావానికి గురయ్యాయి. ఆ పెంపుడు జంతువుల సంతతికి చెందినవే ఈ ఫొటోల్లోని కుక్కలు. చెర్నోబిల్ నిషేధిత ప్రాంతంలో ఇవి పెరిగాయి.

ఈ కుక్కలను డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ సంస్థ చూసుకుంటోంది. చెర్నోబిల్‌లో అణు ప్రమాదం జరిగిన ప్రాంతానికి 18 చదరపు మైళ్ల నిషేధిత ప్రాంతంలోకి మనుషులు వెళ్లరు. అక్కడ నివసిస్తున్న సుమారు 700 కుక్కలకు డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ వైద్య చికిత్స, ఆహారం, ఆశ్రయం అందిస్తోంది.

Also Read: తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు హ్యాక్.. అమ్మకానికి ఈ డేటా..

ఇటీవల జరిగిన సాధారణ శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షల సమయంలో ఆ సంస్థకు చెందిన టీమ్‌ మెరుస్తూ ఉండే నీలి రోమాలు కలిగిన మూడు కుక్కలను గుర్తించింది.

ఆ కుక్కలు వారం క్రితం సాధారణంగానే ఉన్నాయని స్థానికులు తెలిపారు. అకస్మాత్తుగా ఆ కుక్కలు రంగు మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పరిశ్రమల రసాయనాలు లేదా పర్యావరణంలోని భార లోహాల ప్రభావం వంటివి కూడా ఈ కుక్కలు రంగు మారడానికి కారణమయ్యాయా? అన్న అంశాలపైనా నిపుణులు పరిశోధన జరుపుతున్నారు. ఆ కుక్కల రోమాలు, చర్మం, రక్త నమూనాలను పరీక్ష కోసం సేకరిస్తున్నారు.

“కారణం తెలియదు, ఏమి జరుగుతోందో తెలుసుకోవడానికి, వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. వాటిపై ఏదో రసాయన పదార్థ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తోంది. అవి చాలా చురుకుగా ఉన్నాయి, ఇప్పటి వరకు వాటిని పట్టుకోలేకపోయాం” అని డాగ్స్ ఆఫ్ చెర్నోబిల్ సంస్థ తెలిపింది.