New Rules : నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్, జీఎస్టీ, ఆధార్, పెన్షన్‌లో భారీ మార్పులు.. ఇక మీ జేబుకు చిల్లు పడ్డట్టే..!

New Rules : నవంబర్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, జీఎస్టీ, ఆధార్, పెన్షన్ పరంగా అనేక మార్పులు ఉండనున్నాయి.. ఫుల్ డిటెయిల్స్..

New Rules : నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్, జీఎస్టీ, ఆధార్, పెన్షన్‌లో భారీ మార్పులు.. ఇక మీ జేబుకు చిల్లు పడ్డట్టే..!

New Rules

Updated On : October 31, 2025 / 2:22 PM IST

New Rules : వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ నెలలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. బ్యాంకింగ్, కార్డ్ వినియోగంతో పాటు ప్రభుత్వ పత్రాల అప్‌డేట్స్‌కు సంబంధించిన అనేక భారీ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నవంబర్ నుంచి కొన్ని సేవలు ఖరీదైనవిగా మారనున్నాయి. మరికొన్ని పనులు ఈజీగా మారనున్నాయి. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంటులో మరిన్ని నామినీలకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

బ్యాంక్ ఖాతాదారులు ఇప్పుడు (New Rules) ఒకేసారి నలుగురు నామినీలను యాడ్ చేసుకోవచ్చు. ప్రతి నామినీ వాటా, శాతాన్ని ఎంచుకోవచ్చు. గత నామినీ మరణించిన తర్వాత కొత్తగా జాయిన్ అయ్యే నామినీ ఆటోమాటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. మీ బ్యాంకింగ్ కార్యకలాపాలు, జీఎస్టీ చెల్లింపులు, ఆధార్ కార్డ్ అప్‌డేట్స్, పెన్షన్ విధానాలపై ప్రభావం చూపనుంది. మరికొన్ని సకాలంలో పాటించకపోతే అదనపు ఖర్చులు పెరగొచ్చు.

మల్టీ నామినీలతో బ్యాంక్ అకౌంట్లు :
నవంబర్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఖాతాదారులు ఒకే అకౌంటుకు నలుగురు నామినీలను యాడ్ చేసుకోవచ్చు. వినియోగదారులు ప్రతి నామినీకి నిర్దిష్ట శాతం వాటాలను కూడా కేటాయించవచ్చు. అదనంగా, ఒక కొత్త నామినీ ఫీచర్ అమలులోకి వస్తుంది. ఒక నామినీ మరణిస్తే.. తర్వాతి నామినీ వ్యక్తి ఆటోమాటిక్‌గా యాక్టివ్ అవుతారు.

ఈ సౌకర్యం గురించి కస్టమర్లకు స్పష్టంగా తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులను ఆదేశించింది. నామినీ యాడింగ్ కోసం అకౌంట్ ఓపెన్ చేయడం తప్పనిసరి కాదు. నామినీ మరణిస్తే.. వారికి కేటాయించిన వాటా ఆటోమాటిక్‌గా రద్దు అవుతుంది.

Read Also : Bank Holidays November : నవంబర్‌లో మీకు బ్యాంకు పని ఉందా? మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే?

జీఎస్టీలో భారీ మార్పులు :
నవంబర్ 1 నుంచి వస్తువులు, సేవల పన్ను (GST)లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 4 స్లాబ్‌ల జీఎస్టీ సిస్టమ్ రెండు స్లాబ్‌ల ప్రత్యేక రేటుతో రిప్లేస్ అవుతుంది. 12 శాతం, 28 శాతం స్లాబ్‌లను తొలగిస్తారు. లగ్జరీ వస్తువులపై ఇప్పుడు 40 శాతం పన్ను రేటు వర్తిస్తుంది.

ఎస్బీఐ కార్డ్ ఛార్జీలపై అదనపు ఛార్జీలు :

నవంబర్ 1 నుంచి ఎస్బీఐ కార్డ్ యూజర్లు MobiKwik లేదా CRED వంటి థర్డ్-పార్టీ యాప్స్ ద్వారా చేసే విద్య సంబంధిత పేమెంట్లపై ఒక శాతం అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఎస్బీఐ కార్డ్‌ని ఉపయోగించి డిజిటల్ వ్యాలెట్‌లోకి రూ.1,000 కన్నా ఎక్కువ లోడ్ చేస్తే కూడా ఒక శాతం ఛార్జీ పడుతుంది.

ఆధార్ అప్‌డేట్ ఫీజుల సవరణ :
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అక్టోబర్ నుంచి ఏడాది పాటు పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం రూ.125 రుసుమును రద్దు చేసింది. పెద్దలకు, పేరు, అడ్రస్ లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలను అప్‌డేట్ చేసేందుకు రుసుము రూ.75గానే ఉంటుంది. బయోమెట్రిక్ మార్పులకు రూ.125 చెల్లించాలి. ధృవీకరణ కోసం డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయకుండానే ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్స్ చేయవచ్చు.

పెన్షనర్లకు రిమైండర్ :
పెన్షన్ చెల్లింపుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ చివరి నాటికి తమ లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాలి. NPS నుంచి UPS పథకాలకు మారాలని యోచిస్తున్న వారు కూడా ఈ నెలలోనే పూర్తి ప్రక్రియను పూర్తి చేయాలి.

PNB లాకర్ ఛార్జీల సవరణ :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లాకర్ రెంటల్ ఛార్జీలను తగ్గించనుంది. లాకర్ సైజు, కేటగిరీ ఆధారంగా కొత్త రేట్లు నవంబర్‌లో బ్యాంక్ వెబ్‌సైట్‌లో పబ్లీష్ చేయనుంది. అధికారిక నోటిఫికేషన్ తర్వాత 30 రోజుల తర్వాత ఈ కొత్త సవరణ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.