Bank Holidays November : నవంబర్‌లో మీకు బ్యాంకు పని ఉందా? మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే?
Bank Holidays in November 2025 : నవంబర్ 2025లో దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, స్థానిక బ్యాంకులకు మొత్తం 13 రోజులు సెలవులు ఉన్నాయి.
 
                            Bank Holidays in November 2025
Bank Holidays in November 2025 : నవంబర్ నెలలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే, ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే.. నవంబర్‌లో మొత్తం 13 రోజులు సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, స్థానిక బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి.
ఇందులో వారంతపు సెలవులు, పండుగ సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం.. ఈ సెలవులు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
కొన్ని రాష్ట్రాల్లో ఆయా పండగలను బట్టి బ్యాంకులు (Bank Holidays November 2025) మూతపడతాయి. మరికొన్ని రాష్ట్రాల్లో అదే రోజున బ్యాంకులు తెరిచే ఉంటాయి.
బ్యాంకులు మూతపడినప్పటికీ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. కానీ, చెక్ క్లియరింగ్, క్యాష్ డిపాజిట్లు లేదా పాస్‌బుక్ అప్‌డేట్స్ వంటి కౌంటర్ సర్వీసు సెలవుల రోజుల్లో అందుబాటులో ఉండవు.
నవంబర్ 2025 సెలవుల జాబితా
నవంబర్ 1 (శనివారం) : కన్నడ రాజ్యోత్సవం, ఇగాస్-బగ్వాల్ :
కర్ణాటక, ఉత్తరాఖండ్‌లలో ఈరోజున బ్యాంకులు మూతపడతాయి. కర్ణాటకలో ఈ రోజును కన్నడ రాజ్యోత్సవంగా జరుపుకుంటారు. రాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే రోజు. ఉత్తరాఖండ్‌లో దేవతల దీపావళి పండుగగా ఇగాస్-బాగ్వాల్ పండుగను ఈరోజున జరుపుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే? :
నవంబర్ 5 (బుధవారం) : గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ, రహస్ పూర్ణిమ : ఈరోజు అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ, నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జన్మదినం, కార్తీక పూర్ణిమ పండుగ రోజున జరుపుకుంటారు.
నవంబర్ 6 (గురువారం) : నోంగ్‌క్రెమ్ డ్యాన్స్ ఫెస్టివల్.. మేఘాలయలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. ఈ పండుగ ఖాసీ తెగకు చెందిన సాంప్రదాయ పంట పండుగ. షిల్లాంగ్ సమీపంలో 5 రోజుల పాటు జరుపుకుంటారు.
నవంబర్ 7 (శుక్రవారం): వంగల పండుగ.. మేఘాలయలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి.
నవంబర్ 8 (శనివారం) : కనకదాస జయంతి.. కర్ణాటకలో బ్యాంకులకు సెలవు. ఈ పండుగను 16వ శతాబ్దపు కవి శ్రీకనకదాసు జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు.
బ్యాంకులకు ఏయే తేదీల్లో సెలవులంటే? :
- నవంబర్ 2 (ఆదివారం) : అన్ని బ్యాంకులకు వారాంతపు సెలవు.
- నవంబర్ 8 (రెండో శనివారం) : అన్ని బ్యాంకులకు సెలవు.
- నవంబర్ 9 (ఆదివారం) : బ్యాంకులకు సెలవు
- నవంబర్ 15 (మూడో శనివారం) – బ్యాంకులు తెరిచే ఉంటాయి.
- నవంబర్ 16 (ఆదివారం) : బ్యాంకులు పనిచేయవు.
- నవంబర్ 22 (నాల్గవ శనివారం) : బ్యాంకులు మూతపడతాయి.
- 23 నవంబర్ (ఆదివారం) : బ్యాంకులకు సెలవు
- నవంబర్ 29 (ఐదో శనివారం) : బ్యాంకులు తెరిచి ఉంటాయి.
- నవంబర్ 30 (ఆదివారం) : అన్ని బ్యాంకులకు సెలవు.






