New Study : కొత్త 4K, 8K స్ర్కీన్ టీవీలు కొంటున్నారా? డబ్బులు దండగ.. అంతా ఫేక్ బ్రో.. కొత్త స్టడీలో షాకింగ్ నిజాలు.. ఓసారి ఈ స్టోరీ చదవండి..!
New Study : సాధారణ వ్యూ అందించే ఫుల్ HD కన్నా 4K, 8K స్క్రీన్‌లు ఎలాంటి అద్భుతమైన వ్యూ అందించవని ఒక కొత్త అధ్యయనంలో తేలింది.
New Study
New Study : కొత్త టీవీ లేదా ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఒక్క క్షణం ఆగండి.. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ రాగానే వెంటనే కొనేస్తుంటారు. అందులో 4K, 8K స్క్రీన్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ పదం వినగానే వినియోగదారులు వేలకు వేలు డబ్బులు పోసి మరి కొనేసి ఇంటికి తెచ్చేసుకుంటారు.
ప్రస్తుతం మార్కెట్లో ఈ స్ర్కీన్లదే ఆధిపత్యం (New Study) అంటే అతిశయోక్తి కాదు.. రిజల్యూషన్ 4K నుంచి 8K వరకు అంటూ సేల్ కోసం తయారీ కంపనీలు వినియోగదారులకు అంటగట్టేస్తున్నాయి. వీడియో క్వాలిటీ బాగుంటుంది.. పిక్చర్ చాలా క్లియర్ ఉంటుందని చెప్పడంతో అది నమ్మి వినియోగదారులు నిజమేనని కొనేస్తున్నారు. వాస్తవానికి, కొత్త స్టడీ ప్రకారం.. పిక్సెల్స్ అంత క్వాలిటీగా ఉండవు. చూసేంతగా స్మార్ట్‌గా ఉండవని తేలింది.
స్టడీలో ఏం తేలిందంటే? :
కేంబ్రిడ్జ్ యూనివర్శటీ, మెటా రియాలిటీ ల్యాబ్స్ రీసెర్చర్లు ఇటీవల నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో మానవ కన్ను వాస్తవానికి ఎన్ని పిక్సెల్స్ లోతుగా చూడగలదో పరిశీలించింది. ఈ బృందం పిక్సెల్స్ పర్ డిగ్రీ (PPD) అనే మెట్రిక్‌ను ఉపయోగించి వ్యూ లెవల్ పరీక్షించింది. మీ కంటి దృష్టి క్షేత్రంలో ఒక డిగ్రీకి సరిపోయే పిక్సెల్స్ సంఖ్యగా పేర్కొంది. ఒక నిర్దిష్ట పరిమితికి మించి కలర్, కాంట్రాస్ట్ ఆధారంగా దాదాపు 60PPD నుంచి 90 PPD అనేది మన కంటి పిక్సెల్‌లను వేరు చేయలేకపోతుందని వెల్లడించింది.
ఒక్కమాటలో చెప్పాలంటే.. 2.5 మీటర్ల దూరం నుంచి చూసే 50-అంగుళాల టెలివిజన్ వంటి లివింగ్-రూమ్ సెటప్‌లో ఫుల్ హెచ్‌డీ (1080p), 4K లేదా 8K స్క్రీన్ మధ్య దాదాపుగా కనిపించే తేడా పెద్దగా లేదని రుజువైంది. “ఒకసారి స్క్రీన్‌పై ఉన్న పిక్సెల్స్ మీ కన్ను గ్రహించగలిగే దానికన్నా చిన్నవిగా మారితే ఆ పిక్చర్ మరింత స్పష్టంగా కనిపించదు” అని స్టడీ ప్రధాన రచయిత డాక్టర్ మలీహా అష్రఫ్ అన్నారు.
4K, 8K రిజల్యూషన్ ఎప్పుడు బెటర్? :
అధ్యయనం ప్రకారం.. అల్ట్రా-హై-రిజల్యూషన్ డిస్‌ప్లేలు అసలు పనికిరానివని కాదు. 4K, 8K రిజల్యూషన్ అనేది నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే బాగుంటాయని పరిశోధకులు గమనించారు. ఉదాహరణకు, మీరు పెద్ద స్క్రీన్‌కు చాలా దగ్గరగా కూర్చున్నప్పుడు లేదా గ్రాఫిక్ డిజైన్, ఫిల్మ్ ఎడిటింగ్ లేదా గేమింగ్ వంటి ప్రొఫెషనల్ విజువల్ పై వర్క్ చేస్తున్నప్పుడు ఆయా సందర్భాలలో మీ కళ్ళు హై-పిక్సెల్ డెన్సిటీని గుర్తించగలవు.
కానీ చాలా ఇళ్లలో సాధారణంగా వ్యూ అనేది దూరంగా ఉండటంతో హై రిజల్యూషన్ అంతగా కనిపించదు. 8K బ్రాండింగ్ కోసం భారీగా డబ్బులు పోసి కొనే బదులు కలర్ కచ్చితత్వం, కాంట్రాస్ట్, రిఫ్రెష్ రేట్, HDR పర్ఫార్మెన్స్ వంటి ఫొటో క్వాలిటీని అందించే డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయా లేదా అని చూసి కొనాలని నిపుణులు సూచిస్తున్నారు.
8K కన్నా ఫుల్ HD స్ర్కీన్స్ బెటర్ :
ఏ స్రీన్లు బాగుంటాయంటే.. అల్ట్రా-హై-రిజల్యూషన్ స్క్రీన్లు ఊహించినంతగా ఉండవు. పైగా వీటికోసం అధిక మొత్తంలో వినియోగదారులు ఖర్చు చేయాలి. పవర్ కూడా ఎక్కువ అవసరం. వ్యూ పరంగా పెద్దగా ప్రయోజనమే ఉండదు. 4K, 8K చూసేందుకు అట్రాక్టివ్ అనిపించినప్పటికీ మీ కళ్ళు అంతకన్నా బెటర్ వ్యూ చూడగలవని సైన్స్ చెబుతోంది. ఇంకా చెప్పాలంటే ఫుల్ HD స్ర్కీన్ కూడా అంతే షార్ప్‌గా కనిపిస్తుంది. అంతేకానీ రిజల్యూషన్ అప్‌గ్రేడ్ అంటూ డబ్బులు వృధా చేసుకోవద్దని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
