Jemimah Rodrigues Net Worth : ఆటలోనే కాదు.. సంపాదనలోనూ దుమ్ములేపుతున్న జెమీమా రోడ్రిగ్స్.. నికర ఆస్తి ఎంతో తెలుసా?
గ్రౌండ్‌లో తన ఆటతోనే కాదు.. బయట కూడా తన బ్రాండింగ్, సంపాదనతో కూడా 25 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues Net Worth) సంచలనం సృష్టిస్తోంది.
 
                            Jemimah Rodrigues Net Worth From BCCI Contract to WPL deal
Jemimah Rodrigues Net Worth : మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ దుమ్ములేపింది. ఆసీస్ పై అజేయ శతకంతో చెలరేగి భారత్‌కు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో జెమీమా 134 బంతులు ఎదుర్కొంది. 14 ఫోర్ల సాయంతో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె వీరోచిత సెంచరీ కారణంగా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్ఇండియా మరో 9 బంతులు మిగిలి ఉండగానే అందుకుని ఫైనల్‌కు చేరుకుంది.
గ్రౌండ్‌లో తన ఆటతోనే కాదు.. బయట కూడా తన బ్రాండింగ్, సంపాదనతో కూడా 25 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues Net Worth) సంచలనం సృష్టిస్తోంది. ఆమె సంపాదన ఎంతో తెలుసా?
జెమీమా రోడ్రిగ్స్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో బి గ్రేడ్‌లో ఉంది. దీంతో ఆమెకు సంవత్సరానికి బీసీసీఐ రూ.30లక్షలు జీతంగా ఇస్తుంది. ఇది కాక.. మ్యాచ్ ఫీజులు అదనం. ఒక్కొ టెస్టు మ్యాచ్‌కు రూ.15లక్షలు, వన్డేకు ఆరు లక్షలు, టీ20కి మూడు లక్షలు చొప్పున అందుకుంటుంది. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఆమెను ఢిల్లీ 2.2 కోట్లకు రీటైన్ చేసుకుంది.
హ్యుందాయ్, జిల్లెట్, రెడ్ బుల్, డ్రీమ్11, ప్లాటినం ఎవారా వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. వివిధ నివేదికల అంచనా ప్రకారం 2025 నాటికి జెమీమా రోడ్రిగ్స్ నికర ఆస్తుల విలువ రూ. 8 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఉంటుంది.
ఇదిలా ఉంటే.. భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నవంబర్ 2న జరగనున్న ఈ మ్యాచ్‌కు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదిక కానుంది.






