కరోనావైరస్‌ను లాఠీతో గెలవగలమా? పోలీసులు నేర్పించాల్సింది అవగాహన,హింసకాదు

  • Publish Date - March 26, 2020 / 10:35 AM IST

కరోనా వైరస్ వ్యాప్తితో భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ మూడు వారాల పాటు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కొందరు.. అవసరం లేకుండానే రోడ్లపైకి వచ్చేవారు కొందరు ఉంటున్నారు.

ఇళ్లు వదిలి ఎవరూ రాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ కొందరు రోడ్లపై రావడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. పోలీసుల చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పరిస్థితిని హింసతో పరిష్కరించాలనుకోవడం సరికాదనే అభిప్రాయపడుతున్నారు. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మిలియన్ల మందిని కరోనా వణికిస్తోంది. లాక్ డౌన్ విధించడంతో నిత్యావసరాల కోసం బయటకు రాకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఫుడ్, వాటర్ వంటి సాధారణ అవసరాలను ఎలా తీర్చుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు రాష్ట్రాల్లో పోలీసుల హింస ఒకటి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సరైనా కారణంతో  రోడ్లపైకి వచ్చినా కూడా పోలీసులు జనంపై లాఠీకి పనిచెబుతున్నారు. ప్రజలను కట్టడి చేయడం పోలీసులకు సవాళ్లను విసురుతోంది. 

ప్రభుత్వాలు, కేంద్ర, రాష్ట్రాల్లో ఒక్క రోజులో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం ఆషామాషీ కాదు. ఒక రోజు జనతా కర్ఫ్యూ‌తో మొదలై 21 రోజుల కర్ఫ్యూకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ఎప్పటికప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆందోళన చెందొద్దని ప్రజలకు సందేశాల ద్వారా సూచిస్తునే ఉన్నారు.

ఈ మూడు వారాల కర్ఫ్యూ సమయంలో ఇంట్లోనే ఉంటే నిత్యావసర వస్తువులను ఎలా తెచ్చుకోవాలో ప్రభుత్వం చెప్పలేదు.. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి అవసరాలు తీరాలంటే ఎలా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజులో ఉదయమో లేదా సాయంత్రమో ఏదైనా సమయంలో కొన్ని ఆంక్షలను సడలిస్తే ఇలాంటి పరిస్థితులను ప్రజలు అధిగమించవచ్చునని అంటున్నారు. 

మరోవైపు చాలామందికి లాక్ డౌన్ ఎందుకు విధించారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎక్కువ సమూహాలు కలిసి ఒకేచోట చేరితే వైరస్ వ్యాపిస్తుందని అది కమ్యూనిటీ వ్యాప్తికి దారితీస్తుందని అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది.

కానీ, రోడ్లపై ఎవరైనా కనిపిస్తే పోలీసులు ముందుగా వివరాలు అడిగి ఆ తర్వాత వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కనిపించిన ప్రతిఒక్కరిపై లాఠీ విసరడం సబబు కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పోలీసు అధికారి ఒక లాఠీని శుభ్రపరిచే వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు ఆ తరువాత దానిని డిలీట్ చేశారు. 

హింస ఆమోదయోగ్యం కాదు :
* ఇది తప్పు. రాష్ట్రం ఏకపక్షంగా ప్రజలపై హింసను చేయరాదు.
* ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇంటి లోపల ఉండమని అంటున్నారు. 
* కేవలం ఒక రోజులో, భారతదేశంలో పోలీసుల క్రూరత్వానికి చాలా ఘటనలు నిదర్శనంగా కనిపిస్తోంది.
* డెలివరీ సిబ్బందిని, కూరగాయల అమ్మకందారులను లాఠీలతో కొట్టడం వల్ల అవసరమైన వస్తువుల సరఫరా నిలిచిపోతుంది. 
* మూడు వారాలు అంటే చాలా రోజులు ప్రజలు ఆహారం, మందులు కొనడానికి ఇంటి నుండి బయటికి వెళ్లవలసిన అవసరం ఉంటుంది. 
* రాష్ట్రంలో బయటకు రావడం  హింసకు దారితీస్తే.. ప్రజలు అధికారిక ఆదేశాలు వినడం మానేసి ఇతర మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. 
* అన్నింటికంటే మించి ప్రస్తుతం రాష్ట్రానికి సహకారం అవసరం. ఏకపక్ష దాడులు సరికాదు. 
* పోలీసు విభాగాలకు ప్రతిచోటా పోలీసు అధికారులకు శిక్షణ ఇవ్వాలి. అప్రమత్తమైన మర్యాదలో జరిగితే తప్పా పబ్లిక్ సహకరించే అవకాశం ఉంటుంది.