Indian soldiers dance: సిద్ధూ మూసేవాలా పాట ప్లే చేసిన పాక్ ఆర్మీ.. సరిహద్దులో భారత సైనికుడి డ్యాన్స్.. వీడియో వైరల్
పాక్ భూ భాగంపై భారతీయ సింగర్ సిద్ధూ మూసేవాలా పాట ప్లే అయింది. అది కూడా భారత్-పాక్ సరిహద్దులో. దీంతో దగ్గర్లో ఉన్న భారత సైనికులు ఆనందంతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Narender Thiru
- Published On : August 26, 2022 / 07:39 PM IST
Indian soldiers dance: ఇటీవల మరణించిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అనేక దేశాల్లో ఆయన పాటలు ప్లే అవుతుంటాయి. తాజాగా భారత్-పాక్ సరిహద్దులో పాకిస్తాన్ ఆర్మీ కూడా సిద్ధూ పాటల్ని ప్లే చేసింది.
Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం
దీనికి సరిహద్దులో ఉన్న మన సైనికులు ఆనందంతో డ్యాన్స్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సరిహద్దులో పాక్ భూభాగంపై అక్కడి ఆర్మీ జెండాను ఎగరేస్తూ.. లౌడ్ స్పీకర్లో సిద్ధూ పాడిన ‘బంబిహా బోలే’ అనే సాంగ్ ప్లే చేసింది. ఇది చాలా దూరంలో ఇటు వైపు ఉన్న భారత సైనికులకు కూడా వినిపించింది. భారతీయుడైన సిద్ధూ పాటను పాక్ ఆర్మీ ప్లే చేయడంతో మన సైనికులు ఆనందంతో డ్యాన్స్ చేశారు.
Fake Universities List: ఫేక్ యూనివర్సిటీల లిస్టు విడుదల చేసిన యూజీసీ.. జాబితాలో ఏపీ యూనివర్సిటీ
దీన్ని అక్కడున్న కొందరు సైనికులు వీడియో తీశారు. ఈ వీడియోను ధలివాల్ అనే ఒక ఐపీఎస్ అధికారి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
Sidhu’s songs playing across the border! bridging the divide! pic.twitter.com/E3cOwpdRvn
— HGS Dhaliwal (@hgsdhaliwalips) August 25, 2022
