Self Marriage: అంగరంగ వైభవంగా సెల్ఫ్ మ్యారేజ్ చేసుకున్న యువతి
గుజరాత్‌లో వార్తల్లోకి వచ్చిన విషయం.. యువతి సెల్ఫ్ మ్యారేజ్. వడోదరాకు చెందిన క్షమా బిందు జూన్ 9న మూడు ముళ్ల బంధంతో తనను తానే వివాహం చేసుకోవాలనుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సంచలనమైంది. ముందుగా సంప్రదాయబద్ధంగా నిర్ణయించినట్లుగా అదే ముహూర్తానికి వివాహాన్ని జరిపించారు.

Kshama Bindu
Self Marriage: గుజరాత్‌లో వార్తల్లోకి వచ్చిన విషయం.. యువతి సెల్ఫ్ మ్యారేజ్. వడోదరాకు చెందిన క్షమా బిందు జూన్ 9న మూడు ముళ్ల బంధంతో తనను తానే వివాహం చేసుకోవాలనుకున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సంచలనమైంది. ముందుగా సంప్రదాయబద్ధంగా నిర్ణయించినట్లుగా అదే ముహూర్తానికి వివాహాన్ని జరిపించారు.
ఆత్మీయుల సమక్షంలో.. బాజాభజంత్రీల నడుమ వేదమంత్రాల సాక్షిగా క్షమా బిందు ‘స్వీయ వివాహం’ చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలో వరుడిలా, వధువులా తనను తానే పెళ్లి చేసుకున్న క్షమ.. ఒంటరి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.
జూన్ 11న ఫిక్స్ చేసిన ఆమె వివాహాన్ని తప్పుపట్టిన కొందరు రాజకీయ నేతలు అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న దానికంటే రెండ్రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే వివాహం చేసేసుకుంది.
Read Also: తెలంగాణలో తొలి గే వివాహం.. 8ఏళ్ల ప్రేమ తర్వాత
హల్ది, మెహందీ కార్యక్రమాలతోపాటు పెళ్లిలో వేదమంత్రాలు, ఏడడుగులు కూడా నడిచింది. తనకు తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. ఇండియాలో ఇలాంటి వివాహం ఇదే మొదటిది.
సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన క్షమా.. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ రిక్రూట్మెంట్ అధికారిగా పని చేస్తుంది. తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లుగా కాగా తండ్రి దక్షిణాఫ్రికాలో, తల్లి అహ్మదాబాదులో ఉంటున్నారు. వారే కూతురిని అర్థం చేసుకుని చివరికి ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు.
స్నేహితుల సమక్షంలో జరిగిన క్షమా పెళ్లికి వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు.