గరిష్ఠ స్థాయికి విదేశీ మారక నిల్వలు.. దారిద్రంలో దేశ యువత

అందరి జీవితాల్లోనూ లాక్‌డౌన్ పెద్ద కుంగుబాటు తీసుకొచ్చింది. ప్రతి రంగంలోనూ సర్వీసులు మూతపడటంతో ఉద్యోగాలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా స్తంభించిపోయాయి. దేశాధాయం పూర్తిగా పడిపోయినా విదేశీ మారక నిల్వలు మాత్రం భారీగా ఉన్నాయి.
గత వారం నిల్వలు ఆల్ టైం రికార్డుకు చేరాయి. COVID-19 pandemic సమయంలో 3బిలియన్ అమెరికన్ డాలర్లు పెరిగి 490 బిలియన్ అమెరికన్ డాలర్ల అధికానికి చేరింది. మే 29 నాటికి విదేశీ మారక ఆస్తులు పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. డాలర్ నిల్వల ఆధారంగా డాలర్ యేతర ప్రమాణాలైన యూరో, పౌండ్, యెన్ లు విదేశీ మారక నిల్వల విలువల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.
ఇదిలా ఉంటే, దేశంలో వలస కార్మికులకు ఆహారం కొరత, డిగ్రీలు పూర్తయిన వారికి నిరుద్యోగం, రవాణాకు నోచుకోలేక వందల మీటర్లు కాలినడకన ప్రయాణం.. ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని సంక్షోభం లాంటి పరిస్థితులు.