Dehradun RIMC: భారత్ లోనే పురాతన సైనిక కళాశాల “డెహ్రాడూన్ ఆర్‌ఐఎంసీ”కు నేటితో 100 ఏళ్లు

దేశంలోనే పురాతన సైనిక కళాశాలగా పేరొందిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ భారత దేశం గర్వించదగ్గ సైన్యాధికారులను, సైనికులను తీర్చిదిద్దింది.

Rimc

Dehradun RIMC: ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్న రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC) ఏర్పాటై నేటితో వంద ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనే పురాతన సైనిక కళాశాలగా పేరొందిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ భారత దేశం గర్వించదగ్గ సైన్యాధికారులను, సైనికులను తీర్చిదిద్దింది. భారత దేశపు యోధుల ఊయల”గా ప్రసిద్ధి చెందిన ఆర్‌ఐఎంసీ నుంచి.. జనరల్ కెఎస్ తిమ్మయ్య, జనరల్ జిజి బేవూర్, జనరల్ విఎన్ శర్మ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్‌సి సూరి, జనరల్ ఎస్ పద్మనాభన్, ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా వంటి ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు 41 మంది ఆర్మీ కమాండర్లు, 163 మంది లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్‌ అధికారులు ప్రస్తుతం భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు.

Also read: Delhi : డీసీపీ కారును ఢీకొట్టిన పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్..

రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి బాలాకోట్ దాడుల వరకు ఎందరో పోరాట యోధులను అందించిన ఈ సైనిక శిక్షణా సంస్థను 1922 మార్చి 13న అప్పటి వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ VIII ప్రారంభించారు. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కేడర్ ను భారతీయీకరణ చేయడంలో భాగంగా భారతీయ యువకులకు సైనిక కార్యకలాపాలపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు. డెహ్రాడూన్ ఆర్‌ఐఎంసీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు ఆదివారం ఉదయం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఉత్తరాఖండ్ గవర్నర్ ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రేత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు. కళాశాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని సంక్షిప్త పుస్తకాలను విడుదల చేయనున్నారు. రిమ్‌కోలియన్స్ గా పిలువబడే పూర్వవిద్యార్థులు తమ ప్రస్తుత హోదాల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Also read: Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గుడ్ న్యూస్..‘‘యాత్రి నివాస్‌’’ నిర్మాణం

ప్రఖ్యాత నేషనల్ డిఫెన్స్ అకాడమీతో పాటు ఎజిమలలోని నావల్ అకాడమీకి ఇక్కడి నుంచి ఎంపికైన అభ్యర్థులను తరలిస్తారు. ఆల్ ఇండియా కంపెటేటివ్ ఎగ్జామ్ ద్వారా ఎంపికచేయబడ్డ 11-18 ఏళ్ల బాలబాలికలకు డెహ్రాడూన్ ఆర్‌ఐఎంసీ శిక్షణ ఇస్తుంది. కఠినమైన మెరిట్ ఆధారంగా వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ అనంతరం ప్రతి రాష్ట్రం నుండి 250 మంది విద్యార్థులను ఇక్కడ శిక్షణ నిమిత్తం ఎంపిక చేస్తారు. భారత్ లోనే కాకుండా దేశ విదేశాల నుంచి అభ్యర్థులు శిక్షణ కోసం డెహ్రాడూన్ ఆర్‌ఐఎంసీకి వస్తుంటారు. పాకిస్తాన్ ఆర్మీకి చివరి కమాండర్-ఇన్-చీఫ్ అయిన పాకిస్తాన్ జనరల్ గుల్ హసన్ ఖాన్ మరియు పాక్ ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ అస్గర్ ఖాన్, ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ ఇక్కడి నుంచి శిక్షణ పొందినవారిలో ఉన్నట్లు “డీఎన్ఏ వెబ్ సైట్” పేర్కొంది.

Also read: Colorful Holi : రంగుల హోలీలో…నిర్లక్ష్యం వద్దు…జాగ్రత్తలు తప్పనిసరి