Delhi : డీసీపీ కారును ఢీకొట్టిన పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్..

డీసీపీ కారును ఢీకొట్టిన కేసులో పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేరోజు..

Delhi : డీసీపీ కారును ఢీకొట్టిన పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్..

Paytm Ceo Arrested.. Later Released On Bail For Rash Driving

Paytm CEO arrested, later released on bail for rash driving : ప్రముఖులు ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఈజీగా ఈజీగా బయటకొచ్చేయొచ్చు. అదే ఏ సామాన్య వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అరెస్ట్..వాహనం సీజ్ వంటివి వెంట వెంటనే జరిగిపోతాయి. లేదా ఏ పోలీసు ఉన్నతాధికారుల వాహనాన్ని క్రాస్ చేసి ముందుకెళితే నానా రాద్ధాతం జరుగుతుంది. అలా జరిగిన ఘటనలు లేకపోలేదు. కానీ పేటీఎం వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరెస్ట్ చేసిన రోజే బెయిల్ పై ఆయన విడుదల కావటం మరో విశేషం.

Also read : Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గుడ్ న్యూస్..‘‘యాత్రి నివాస్‌’’ నిర్మాణం

ఫిబ్రవరి 22న దక్షిణ ఢిల్లీలోని అరబిందో మార్గ్ లో మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద శర్మ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారు .. డీసీపీ (South Delhi) బెనితా మేరీ జైకర్ కారును ఢీకొట్టినట్టు ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి సుమన్ నల్వా తెలిపారు. ఆ సమయంలో కారులో డీసీపీ లేరు అని ఓ అధికారి తెలిపారు. కానీ డీసీపీ కారును నడిపిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Also read : Peacocks Died: పంటపొలంలో విషం తిని 12 నెమళ్ళు మృతి.. రైతు అరెస్ట్

దీనిపై కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ మాట్లాడతూ.. ‘‘మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ట్రాఫిక్ జామ్ ఉంది..ఆ సమయంలో ఓ కారు స్పీడ్ గా వచ్చి నేనే నడిపే వాహనాన్ని (DCP వాహనం)డ్యాష్ ఇచ్చి అంతే స్పీడ్ తో దూసుకుంటూ ముందుకు వెళ్లిపోయిది..ఆ ఘటనలో మా కారు డ్యామేజ్ అయింది అనీ..ఇదే విషయాన్ని డీసీపీ జైకర్ కు తెలియజేశాం అని తెలిపాడు. ఈ సూచనల మేరకు కారు నెంబర్ ఆధారంగా మాలవీయ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశాము అని తెలిపారు. పోలీసులు మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 279 (రాష్ డ్రైవింగ్ లేదా పబ్లిక్ దారిలో రైడింగ్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Also read : Ponytail Ban In school:స్కూల్స్ లో అమ్మాయిలు పోనీ టెయిల్‌ వేసుకోవడం నిషేధం..లోదుస్తుల రంగుల్లోనూ ఆంక్షలు

నెంబర్ ఆధారంగా ఢీకొట్టిన కారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఐపీసీ సెక్షన్ 279 కింద విజయ్ శర్మను పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు. బెయిల్ పై వెంటనే విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తులో..ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనం గుర్తించబడింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను గుర్తించిన తరువాత ఫిబ్రవరి 22 న అరెస్టు చేసి, అదే రోజు బెయిల్‌పై విడుదల చేయబడింది, ”అని PRO నల్వా తెలిపారు.