Ponytail Ban In school:స్కూల్స్ లో అమ్మాయిలు పోనీ టెయిల్ వేసుకోవడం నిషేధం..లోదుస్తుల రంగుల్లోనూ ఆంక్షలు
అమ్మాయిలపై ధరించే దుస్తులు..జుట్టు ఎలా వేసుకోవాలి? అనే విషయంలో ఆంక్షలు విధించింది ప్రభుత్వం. అమ్మాయిలు పోనీ టైల్ వేసుకుని స్కూల్ కు రావొద్దని ఆంక్షలు విధించింది ప్రభుత్వం.

Ponytail Ban In School
Ponytail Ban In school : అమ్మాయిలపై ధరించే దుస్తులు..జుట్టు ఎలా వేసుకోవాలి? అనే విషయంలో ఆంక్షలు కేవలం భారతదేశంలోనే కాదు టెక్నాలజీలోను..డెవలప్ మెంట్ లోను దూసుకుపోతున్న దేశాల్లోకూడా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. భారతదేశంలో అమ్మాయిలు బురఖా ధరించకూడదు..పొట్టి దుస్తులు ధరించకూడదు వంటి ఆంక్షలు పలు వివాదాలకు కారణమవుతున్నాయి. ఈక్రమంలో టెక్నాలజీ అంటే జపాన్..జపాన్ అంటే టెక్నాలజీ అనే జపాన్ లో కూడా విద్యార్థినులపై ఆంక్షలు విధించారు. స్కూల్లో విద్యార్ధినిలు వేసుకునే హెయిర్ స్టైల్స్ విషయంలోనూ..ఆఖరికి వారు ధరించే లో దుస్తులు విషయంలో కూడా ఆంక్షలు విధించారు జపాన్ దేశంలో.
Also read : Saudi Arabia: ఒకే రోజు 81 మందికి మరణశిక్ష విధించిన సౌదీఅరేబియా
అమ్మాయిలు పోనీటెయిల్స్ (Ponytails) వేసుకుంటే క్యూట్ గా కనిపిపిస్తారు. అందుకే చాలామంది అమ్మాయిలు పోనీ టైల్ వేసుకుంటారు. కానీ ఇకనుంచి అలా పోనీ టైల్ వేసుకోకూడదని ఆంక్షలు విధించారు.ఈ ట్రెండీ హెయిర్‌స్టైల్‌పై జపాన్ లోని ఓ స్కూల్ నిషేధం విధించింది. స్కూళ్లకు వచ్చే అమ్మాయిలు పోనీటెయిల్ వేసుకురాకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది జపాన్ ప్రభుత్వం.
ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ప్రపంచ దేశాల కంటే ముందంజలో ఉన్న జపాన్ లో ఆడపిల్లలపై ఇటువంటి ఆంక్షలు విధించటం గమనించాల్సిన విషయం. అమ్మాయిల వస్త్రధారణ, హెయిర్ స్టైల్స్‌కు సంబంధించి తాజాగా విధించిన ఆంక్షల గురించి తెలిస్తే ఇది జపానా? లేదా ఉత్తరకొరియా దేశమా? అనే అనుమానం వచ్చి తీరుతుంది.
Also read : Congo Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 60 మందికి పైగా మృతి!
అమ్మాయిలు పోనీటెయిల్ వేసుకుని రావడం వల్ల జుట్టు కింద మెడ భాగం బయటకు కనిపిస్తుందని, దీనివల్ల క్లాస్ రూమ్ లో విద్యార్థుల దృష్టి మరలుతుందని ఓ సర్వేలో తేలిందట..అందుకే జపాన్ ప్రభుత్వం ఇటువంటి వింత ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. అమ్మాయిల మెడభాగం విద్యార్థులను (మగ పిల్లలను) లైంగికంగా ఉద్రేకపరుస్తుందని అందుకే ఈ కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు జపాన్ అధికారులు చెప్పుకొస్తున్నారు.
లోదుస్తులు ధరించే విషయంలోను ఆంక్షలే..
జపాన్‌లోని ఫుకుయోకా ప్రాంతంలోని కొన్ని స్కూల్స్ లో ఇటీవల ఒక సర్వే నిర్వహించగా..పోనీటెయిల్ కారణంగా కనిపించే అమ్మాయిల మెడ వల్ల అబ్బాయిలు ఉద్రేకానికి లోనవుతున్నారని ఈ సర్వేలో తేలింది. దీంతో స్కూల్ కు వెళ్లే ఆడపిల్లలు పోనీటెయిల్ జడ వేసుకొని (పోనీ టైల్ కూడా ) రావడాన్ని నిషేధించారు. పోనీ టైల్ లేదా జడగానీ వేసుకుంటే మెడ భాగం బయటకు కనిపిస్తుందని పోనీ టెయిల్ (జడ)నిషేధించిన ప్రభుత్వం.. అదే మెడ బయటకు కనిపించే ఆస్కారమున్న బాబ్ హెయిర్ స్టైల్‌ను వేసుకోవచ్చని తెలిపింది.
Also read : Ind Vs SL Day 1 : ముగిసిన తొలిరోజు ఆట.. శ్రీలంక స్కోర్ 86/6
జపాన్‌లో అమ్మాయిలకు సంబంధించి ఇటువంటి ఆంక్షలే కాదు ఇంకా చాలానే ఉన్నాయి. చిత్ర విచిత్రమైన నియమాలు, ఆంక్షలు ఉన్నాయి. జపాన్ లోని స్కూల్స్ కు వెళ్లే అమ్మాయిల సాక్స్ పొడవుగా ఉన్నవే ధరించాలి.అలాగే స్కర్ట్ కూడా పొడవుగా ఉండాలి. అంటే మోకాలు దాటి ఉండాలి. అంతేకాదు అమ్మాయిలు ధరించే లో దుస్తులు విషయంలో కూడా ఆంక్షలున్నాయి. అమ్మాయిలు తెల్లని రంగు ఉన్న లోదుస్తులు మాత్రమే ధరించాలని ఆంక్షలు విధించారు. అంతేనా ఇంకా ఉన్నాయి..జుట్టుకు నలుపు తప్ప ఎలాంటి రంగు వేసుకోకూడదు.