IndiGo Flight
IndiGo Flight : ఢిల్లీ నుండి ముంబయి వెళ్తున్న 6E 6107 విమానంలో మహిళకు అందించిన శాండ్‌విచ్‌లో పురుగు ప్రత్యక్షమైంది. సిబ్బందికి కంప్లైంట్ చేయడంతో ఆ మహిళకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది.
little__curves అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ మహిళ ఇండిగో విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఆమెకు సిబ్బంది ఇచ్చిన శాండ్ విచ్‌లో పురుగు పాకడం చూసి షాకయ్యారు. ఆ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసిన పోస్టులో ‘నేను త్వరలో ఇమెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేస్తాను.. శాండ్ విచ్ నాణ్యత బాగా లేదని తెలిసినా పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్‌గా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫ్లైట్ అటెండెంట్‌కి తెలియజేసినా ఇతరులకు శాండ్ విచ్ అందించడం కొనసాగించింది. ఇక్కడ పిల్లలు, వృద్ధులు మరియు ఇతర ప్రయాణీకులు ఉన్నారు. ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకితే ఎలా ఉంటుంది?’ అనే శీర్షికతో పోస్టు చేసారు. తనకు ఎలాంటి పరిహారం అవసరం లేదని ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత మీ ప్రధాన బాధ్యతగా హామీ ఇస్తే చాలని ఆ మహిళ పేర్కొన్నారు.
Delhi dense fog : ఢిల్లీలో కమ్ముకున్న పొగమంచు.. 134 విమానాలు, పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం
ఈ ఘటనపై ఇండిగో ఒక ప్రకటనలో ఆ మహిళకు క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం దర్యాప్తులో ఉందని తెలిపింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా క్యాటరర్‌తో పరిశీలిస్తున్నామని ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము అంటూ ఇండిగో జోడించింది.