KSRTC : డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి KSRTC వినూత్న నిర్ణయం.. 1,600 మంది డ్రైవర్స్‌కి ఏం చేసిందో తెలుసా?

హైవేలపై ప్రమాదాలను అరికట్టడానికి KSRTC వినూత్న నిర్ణయం తీసుకుంది. రహదారుల భద్రత కోసం.. డ్రైవర్లను అప్రమత్తం చేయడం కోసం ఏం చేయబోతోందంటే?

KSRTC : డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి KSRTC వినూత్న నిర్ణయం.. 1,600 మంది డ్రైవర్స్‌కి ఏం చేసిందో తెలుసా?

KSRTC

Updated On : December 30, 2023 / 3:57 PM IST

KSRTC : హైవేలపై జరిగే ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుఝామున 3 నుండి 4 గంటల మధ్య జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో డ్రైవర్లు అలసటకు గురవడమే ప్రధాన కారణం. ఈ సమయంలో డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచడం కోసం కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్సు  డ్రైవర్లకు థర్మోస్ ప్లాస్క్ లు ఇవ్వాలని నిర్ణయించింది.

Indonesia : టైర్లతో చెప్పులు.. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఓ సంస్థ వినూత్న వ్యాపారం

హైవేలపై ప్రమాదాలను అరికట్టడానికి ప్రయాణికుల భద్రత లక్ష్యంగా కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది. 500 ml సామర్థ్యం ఉన్న 1,600 థర్మోస్ ప్లాస్క్‌లు డ్రైవర్లకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్లాస్క్‌లలో టీని వెంట తీసుకెళ్లడం ద్వారా డ్రైవర్లు విరామ సమయంలో టీ సేవించి రిఫ్రెష్ అవుతారని భావిస్తోంది. అది వారికి అప్రమత్తంగా ఉండటంలో సహాయపడుతుంది.

రహదారి ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారు ఝామున 3 నుండి 4 గంటల మధ్య సంభవిస్తున్నాయి. ఆ సమయంలో డ్రైవర్లు అలసటకు గురి కావడం, నిద్రలోకి జారుకోవడంతో భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో KSRTC టీ తీసుకెళ్లేందుకు థర్మోస్ ప్లాస్క్ అందించడం వల్ల డ్రైవర్లు నిద్ర మత్తులోకి జారుకోకుండా నిరోధించడంతో పాటు రహదారి భద్రతను పెంచడంలో దోహదపడుతుందని KSRTC విశ్వసిస్తోంది. రాబోయే వారాల్లో థర్మోస్ ఫ్లాస్క్‌లను డ్రైవర్లకు పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

UP Roadways: 25 మంది కంటే తక్కువ ప్రయాణికులు ఉంటే బస్సు కదలదు.. ఆర్టీసీ కొత్త నిర్ణయం

KSRTC తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించారు. ఈ సమస్యను నివారించడానికి ఇప్పటికే రాత్రి బస్సులో ఇద్దరు డ్రైవర్లను నియమించడం లేదా? అని ప్రశ్నించారు. మరికొందరు KSRTC ఇలాగే ఉంటుంది.. జై కర్నాటక అంటూ పోస్టులు పెట్టారు.