Indonesia : టైర్లతో చెప్పులు.. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఓ సంస్థ వినూత్న వ్యాపారం

కొంతమంది పనికిరాని వస్తువులను కళాఖండాలుగా మార్చేస్తుంటారు. అయితే ఓ సంస్థ పనికిరాని టైర్లతో చెప్పులు తయారు చేస్తోంది. ఇలా చేయడం వెనుక సామాజిక కోణం ఉంది. అదేంటో చదవండి.

Indonesia : టైర్లతో చెప్పులు.. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఓ సంస్థ వినూత్న వ్యాపారం

Indonesia

Indonesia : పర్యావరణ పరిరక్షణ కోసం అనేక సంస్థలు, వ్యక్తులు పోరాటం చేయడం చూస్తుంటాం. అయితే ఓ పరిశ్రమ సైతం ముందుకు వచ్చింది. 2004 నుండి వినూత్న తరహాలో వ్యాపారం చేస్తోంది. ఇండోనేషియాలో భూమి, నదులు కాలుష్యానికి గురవకుండా 1 మిలియన్ టైర్లను సేకరించే పనిలో పడింది ఆ సంస్థ. అయితే వీటితో ఆ సంస్థ ఏం చేస్తుంది? ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.

Prabhas Fans : జపాన్‌లో ప్రభాస్ అభిమానుల హంగామా.. ప్రభాస్‌కి ప్రసాదాలు పెట్టి, పూజలు చేసి..
భూమిపై పనికి రాని వస్తువు లేదంటారు. చాలామంది పనికి రావని పక్కన పడేసిన అనేక వస్తువులను అద్భుతాలుగా మారుస్తుంటారు. అలాగే పనికి రాని టైర్లను ఏం చేస్తాం? అని మనం అనుకోవచ్చు. కానీ ఇండోసోల్ అనే సంస్థ క్రియేటివ్‌గా ఆలోచించింది. ఆ ఆలోచన వెనుక ఓ సామాజిక కోణం కూడా ఉంది. పనికి రాని టైర్లు రీసైకిల్ చేసి మళ్లీ మనం ఉపయోగించగలమని నిరూపించింది ఆ సంస్థ.. పనికి రాని టైర్లను అందమైన చెప్పులు తయారు చేస్తూ వ్యాపారం చేస్తోంది. అందుకోసం విరిగిపోయి ముక్కలైన టైర్లను సేకరిస్తోంది. ఇవి పర్యావరణానికి హానికారం కాకుండా వాటితో తిరిగి చెప్పులను తయారు చేసి విక్రయిస్తోంది.

Italian couple : ఇటలీ దంపతుల ఔదార్యం…కరీంనగర్ అనాథ బాలుడి దత్తత

ఇండోసోల్ సంస్థ 2004 లో ఏర్పడింది. కైల్ పార్సన్స్ అనే వ్యక్తి ఆలోచన నుండి పుట్టినదే ఈ సంస్థ. ఇప్పటికే 31,000 పనికిరాని టైర్లను సేకరించిన ఈ సంస్థ పర్యావరణ కాలుష్యం నుండి ఇండోనేషియాను కాపాడటంలో తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఈ కంపెనీ రోజుకు 10,000 జతల చెప్పుల్ని తయారు చేస్తోందంటే ఆశ్చర్యపోవాలి. ఈ సంస్థ చేస్తున్న మంచి ప్రయత్నాన్ని సైతం అభినందించాలి.