Italian couple : ఇటలీ దంపతుల ఔదార్యం…కరీంనగర్ అనాథ బాలుడి దత్తత

ఓ అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్న ఉదంతం కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. కరీంనగర్ నగరంలోని శిశుగృహలో నివాసం ఉంటున్న ఆరేళ్ల అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు.....

Italian couple : ఇటలీ దంపతుల ఔదార్యం…కరీంనగర్ అనాథ బాలుడి దత్తత

Italian couple adopt boy

Italian couple : ఓ అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్న ఉదంతం కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. కరీంనగర్ నగరంలోని శిశుగృహలో నివాసం ఉంటున్న ఆరేళ్ల అనాథ బాలుడిని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు. మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అనాథ బాలుడిని ఇటలీకి చెందిన దంపతుల సంరక్షణకు అప్పగించారు.

ALSO READ : New Vande Bharat Express Trains : త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన దత్తత ఉత్తర్వు, బాలుడి జనన ధృవీకరణ పత్రం కాపీని కూడా కలెక్టర్ ఇటాలియన్ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా ఇటలీ దంపతులతో మాట్లాడారు. కొంతకాలం క్రితం ఇటలీకి చెందిన దంపతులు కరీంనగర్ కలెక్టరుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ALSO READ : New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు…నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష

ఇటలీ దంపతుల ఉద్యోగ వివరాలు, వారి ఆర్థిక స్థితి, నివాస వివరాలను అడిగి తెలుసుకొని అనాథ బాలుడి భవిష్యత్తు గురించి చర్చించి దత్తత ఇచ్చారు.కరీంనగర్‌ శిశుగృహలో ఉంటున్న బాలుడిని సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ ద్వారా ఇటలీ దంపతులకు దత్తత తీసుకున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి తెలిపారు.

ALSO READ : Pregnant : బీహార్ మహిళ కు.ని. ఆపరేషన్ చేయించుకున్నా మూడోసారి గర్భం దాల్చింది…

బాలుడు దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో పాటు ఇటలీకి వెళ్లేలా సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్ట్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి, మార్కెటింగ్ డీడీ పద్మావతి, డీసీపీఓ శాంతి, ఐసీపీఎస్ సిబ్బంది తిరుపతి, తేజస్వి తదితరులు పాల్గొన్నారు.