Cleanest City Indore: ఆరోసారి అతిశుభ్ర నగరంగా ఇండోర్.. స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితా వెల్లడించిన కేంద్రం

‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల జాబితా’ను కేంద్రం శనివారం విడుదల చేసింది. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్ అతి శుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. అతి శుభ్రమైన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.

Cleanest City Indore: దేశంలో అతి శుభ్రమైన నగరంగా నిలిచింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్. వరుసగా ఆరో ఏడాది ఇండోర్ ఈ ఘనత సాధించడం విశేషం. ‘స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితా’ను కేటగిరీల వారీగా కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాకు సంబంధించిన అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు అవార్డులు అందుకున్నారు.

Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం

ఈ జాబితా ప్రకారం.. పెద్ద నగరాలకు సంబంధించి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ అతి శుభ్రమైన నగరంగా నిలిచింది. ఆ తర్వాత గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానంలో నిలవగా, మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో నిలిచింది. గత ఏడాది మాత్రం విజయవాడ మూడో స్థానంలో నిలవగా, ఈసారి ఒక స్థానం కోల్పోయింది. ఇక స్వచ్ఛమైన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌ఘడ్ రెండో స్థానం, మహారాష్ట్ర మూడో స్థానం సాధించాయి. వందకంటే ఎక్కువ అర్బన్ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర మొదటి స్థానంలో ఉంది. ఏపీకి సంబంధించి వివిధ విభాగాల్లో విజయవాడతోపాటు, తిరుపతి, విశాఖ పట్నం, పుంగనూరు, పులివెందులకు కూడా అవార్డులు దక్కాయి.

CM KCR New Party: కేసీఆర్ కొత్త పార్టీ పేరు ఇదే.. ప్రకటనకు ముహూర్తం ఖరారు!

లక్షకంటే ఎక్కువ మంది ఉన్న స్వచ్ఛమైన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచగని మొదటి స్థానంలో నిలవగా, ఛత్తీస్‌ఘడ్‌లోని పటాన్ రెండో స్థానంలో, మహారాష్ట్రలోని కర్హాడ్ మూడో స్థానంలో ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్‪‌కు సంబంధించి ఇది ఏడో సర్వే. మొదటిసారి 2016లో ఈ సర్వే నిర్వహించారు. అప్పట్లో 73 నగరాలనే సర్వే చేయగా, ఇప్పుడు 4,354 పట్టణాలను సర్వే చేసి ఈ జాబితా వెల్లడించారు.

 

ట్రెండింగ్ వార్తలు