CM KCR New Party: కేసీఆర్ కొత్త పార్టీ పేరు ఇదే.. ప్రకటనకు ముహూర్తం ఖరారు!

తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. పార్టీ పేరును కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన, కొత్త ఆఫీసు ప్రారంభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ అంశంపై ఆదివారం ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు.

CM KCR New Party: కేసీఆర్ కొత్త పార్టీ పేరు ఇదే.. ప్రకటనకు ముహూర్తం ఖరారు!

CM KCR New Party: తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్తగా స్థాపించనున్న జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. దసరా రోజే (బుధవారం) కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. ఈ పార్టీకి ‘భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)’ అని నామకరణం చేయనున్నారు. అనేక పేర్లు పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ వైపే కేసీఆర్ మొగ్గుచూపారు.

Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం

పార్టీ స్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అదే రోజు ఢిల్లీలో తాత్కాలిక పార్టీ ఆఫీసు కూడా ప్రారంభమవుతుంది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ ఆఫీసు సిద్ధమవుతోంది. పార్టీ ఏర్పాటు కార్యక్రమాల్ని పర్యవేక్షించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా జాతీయ కో-ఆర్డినేటర్ల నియామకంపై కూడా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ సీఎంలు కుమార స్వామి, శంకర్ సింగ్ వాఘేలా, నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొంటారు. ప్రకాశ్ రాజ్‌కు దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ హైదరాబాద్‍‌, ప్రగతి భవన్‌లో సమావేశమవుతారు.

Anshul Bhatt: ముంబై బాలుడిని అభినందిస్తూ ట్వీట్ చేసిన బిల్‌గేట్స్.. ఎందుకో తెలుసా?

ఈ సమావేశంలో జాతీయ పార్టీ పరిణామాలు, పార్టీ ప్రకటన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం వారితోనే లంచ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా తెలంగాణలో 16 ఎంపీ సీట్లతోపాటు, దేశవ్యాప్తంగా మరో 50 సీట్లను కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసమొత్తంగా దేశవ్యాప్తంగా 70 ఎంపీ సీట్లు గెలిచేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో పట్టుకోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.