Anshul Bhatt: ముంబై బాలుడిని అభినందిస్తూ ట్వీట్ చేసిన బిల్‌గేట్స్.. ఎందుకో తెలుసా?

ముంబైకు చెందిన పదమూడేళ్ల బాలుడిని అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. అన్షుల్ భట్ అనే బాలుడు ‘వరల్డ్ యూత్ ట్రాన్స్‌నేషనల్ ఛాంపియన్‌షిప్స్’ గెలిచినందుకుగాను ఈ ట్వీట్ చేశారు.

Anshul Bhatt: ముంబై బాలుడిని అభినందిస్తూ ట్వీట్ చేసిన బిల్‌గేట్స్.. ఎందుకో తెలుసా?

Anshul Bhatt: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ముంబైకు చెందిన బాలుడిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అన్షుల్ భట్ అనే బాలుడు పదమూడేళ్ల వయసులోనే ‘వరల్డ్ యూత్ ట్రాన్స్‌నేషనల్ ఛాంపియన్‌షిప్స్’లో ఏకంగా మూడు గోల్డ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించినందుకుగాను బిల్‌గేట్స్ అభినందించారు.

Anti-CAA Protesters: సీఏఏ నిరసనల్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రూ.57 లక్షలు చెల్లించాలంటూ పోలీసుల నోటీసులు

గత ఆగష్టులో, ఇటలీలో జరిగిన అండర్-16 విభాగంలో అన్షుల్ భట్ టైటిల్ సాధించాడు. ఈ కప్ గెలిచిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ కార్డ్ గేమ్ ఈవెంట్‌లో ఛాంపియన్‌షిప్‌తోపాటు, మరో రెండు అవార్డుల్ని కూడా అన్షుల్ గెలుచుకున్నాడు. దీనిపై బాలుడిని అభినందిస్తూ బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. ‘‘కాలక్షేపం కోసం నేను ఆడే ఇష్టమైన ఆటలో కొత్త ఛాంపియన్ గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది. కొంచెం ఆలస్యమైనా అన్షుల్ భట్‌కు అభినందనలు చెబుతున్నాను’’ అంటూ బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు.

Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం

అన్షుల్ గత ఆగష్టులో విజేతగా నిలిస్తే, బిల్‌గేట్స్ సెప్టెంబర్ 29న ట్వీట్ చేశారు. అన్షుల్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు.