Anti-CAA Protesters: సీఏఏ నిరసనల్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రూ.57 లక్షలు చెల్లించాలంటూ పోలీసుల నోటీసులు

సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకుగాను, నష్టపరిహారంగా రూ.57 లక్షలు చెల్లించాలని 60 మంది ఆందోళనకారులకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Anti-CAA Protesters: సీఏఏ నిరసనల్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రూ.57 లక్షలు చెల్లించాలంటూ పోలీసుల నోటీసులు

Updated On : October 1, 2022 / 6:32 PM IST

Anti-CAA Protesters: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ (సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా 2019లో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్‌లో ఈ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది.

GST collections: 26 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబర్‌లో రూ.1.47 లక్షల కోట్లు వసూలు

ఈ సందర్భంగా జరిగిన ఆందోళనల్లో అనేక చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ అంశానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్ పోలీసులు దాదాపు 60 మందికి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకుగాను, రూ.57 లక్షలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బిజ్నూర్ జిల్లా, నెతౌర్ పోలీసు అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. 2019, డిసెంబర్ 20న జరిగిన అల్లర్ల సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని, వాటికి నష్టపరిహారంగా రూ.57 లక్షలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం

మొత్తం 60 మందికి ఈ నోటీసులు పంపినట్లు స్టేషన్ ఆఫీసర్ పంకజ్ తోమర్ చెప్పారు. అప్పట్లో ఘర్షణల సందర్భంగా గుంపులుగా దూసుకొచ్చిన ఆందోళనకారులు పోలీసు జీపును తగలబెట్టడంతోపాటు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు ఆందోళనకారులు పోలీసుల మీద కూడా దాడి చేశారు. ఈ దాడుల్ని ఎదుర్కొనేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.