GST collections: 26 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబర్‌లో రూ.1.47 లక్షల కోట్లు వసూలు

జీఎస్టీ వసూళ్లలో గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఏ ఏడాది సెప్టెంబర్‌లో 26 శాతం వృద్ధి నమోదైంది. ఏకంగా సెప్టెంబర్‌లో రూ.1,47,686 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ స్థాయిలో జీఎస్టీ వసూలు కావడం వరుసగా ఇది ఏడోసారి.

GST collections: 26 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబర్‌లో రూ.1.47 లక్షల కోట్లు వసూలు

GST collections: దేశంలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) వసూళ్లు 26 శాతం పెరిగాయి. గత సెప్టెంబర్‌లో రూ.1,47,686 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. జీఎస్టీ వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లు దాటడం వరుసగా ఇది ఏడోసారి.

Kohli And MS Dhoni: ధోని, కోహ్లీ సరిగ్గా ఆడకపోతే టీవీ రేటింగులు పడిపోతాయి: గ్రేమ్ స్వాన్

వీటిలో సెంట్రల్ జీఎస్టీ రూ.25,271 కోట్లుకాగా, స్టేట్ జీఎస్టీ రూ.31,813 కోట్లు, ఐజీఎస్టీ రూ.80,464 కోట్లుగా ఉంది. ఇక సెస్ రూపంలో మరో రూ.10,137 కోట్లు వసూలయ్యాయి. గత నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 39 శాతం పెరగగా, దేశీయ లావాదేవీల ఆదాయంలో 22 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. కాగా, సెప్టెంబర్‌లో ఒక రోజు అత్యధికంగా జీఎస్టీ వసూలైంది. గత నెల 20న ఏకంగా రూ.49,453 కోట్లు వసూలయ్యాయి. ఒక రోజు వసూలైన రెండో అత్యధిక జీఎస్టీ ఇది. ఈ ఒక్క రోజే జీఎస్టీకి సంబంధించి 8.77 లక్షల చలాన్లు వసూలయ్యాయి.

Rs 6 crore decoration: ఆరు కోట్ల విలువైన నగలు, కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. ఏపీలో ఆకర్షిస్తున్న దేవాలయం

అంతకుముందు జూలైలో ఒకే రోజు (జూలై 20న) రూ.57,846 కోట్లు వసూలయ్యాయి. ఆ రోజు మొత్తం 9.58 లక్షల చలాన్లు దాఖలయ్యాయి. ఈ నెలలో మొత్తంగా 1.1 కోట్ల ఈ-వే బిల్లులు, ఇన్ వాయిస్‌లు దాఖలయ్యాయి. జీఎస్టీ పోర్టల్‌ ఎలాంటి ఆలస్యానికి తావు లేకుండా పనిచేయడం వల్ల ఈ వసూళ్లు సాధ్యమయ్యాయని కేంద్రం తెలిపింది.