సింధులోయ నాగరికతలోనే, అమూల్‌ను మించిన డెయిరీ ఇండస్ట్రీ ఉంది.. ఇదిగో సాక్ష్యాలు

Indus valley dairy production : డెయిరీ ప్రొడక్షన్.. అదే పాల ఉత్పత్తి.. ఇప్పడిది కాదు.. భారతదేశంలో క్రీస్తుపూర్వం 3వ సహస్రాబ్దిలో సింధు లోయ నాగరికతలోనే పాల ఉత్పత్తి ప్రారంభమైందంట. సింధు లోయ నాగరికతలో పాల ఉత్పత్తి అనేది క్రీ.పూ 2500 నాటిదిగా గుర్తించింది కెనడియన్ భారతీయ పరిశోధకుల బృందం. సింధు లోయ నాగరికతను నిలబెట్టడానికి ఈ డెయిరీ ప్రొడక్షన్ ఒక కారణమని పరిశోధకుల అధ్యయనంలో తేల్చేశారు.
క్రీస్తుపూర్వం 2500లో సింధు లోయ నాగరికతలో పాల ఉత్పత్తి ప్రారంభమైందనడానికి శాస్త్రీయంగా రుజువు కావడం ఇదే మొదటిసారి. పాల ఉత్పత్తికి ఇదే మొట్టమొదటి సాక్ష్యమంటోంది అధ్యయన బృందం.
University of Toronto Mississauga పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకుడైన కళ్యాణ్ శేఖర్ చక్రవర్తి నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నేచర్ జర్నల్‌లో ప్రచురించింది.
గుజరాత్‌లోని గ్రామీణ స్థావరం అయిన Kotada Bhadli పురావస్తు ప్రదేశంలో లభించిన కుండల ముక్కలలోని అవశేషాల పరమాణు రసాయన విశ్లేషణ ఆధారంగా వెల్లడించారు. అధ్యయనం చేసిన 59 శాంపిల్స్‌లో 22 పాడి లిపిడ్ల ఉనికిని బయటపెట్టాయి.
స్థిరమైన ఐసోటోప్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా పరిశోధకులు పాడి కోసం ఉపయోగించే రమినెంట్ రకాన్ని కూడా గుర్తించారు. ఇందులో మేకలు, గొర్రెలు కాకుండా ఆవులు, గేదె వంటి పశువులు కూడా ఉన్నాయని తేల్చారు.
పాల ఉత్పత్తి లభ్యత కారణంగా పురాతన సమాజాలకు సాయపడి ఉండొచ్చునని చక్రవర్తి వివరించారు. మందలోని జంతువుల సంఖ్యను ప్రభావితం చేయకుండా.. జంతు ప్రోటీన్ మిగులును కూడబెట్టేవారు. ఈ స్థాయి పాల ఉత్పత్తి గృహ వినియోగానికి మించే ఉంటుందని చక్రవర్తి అభిప్రాయపడ్డారు.
పరిశోధనలో పాల్గొన్న భారతీయులు పుణేలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ప్రాచీన భారతీయ చరిత్ర సంస్కృతి పురావస్తు శాఖ ప్రొఫెసర్ Prabodh Shirvalkar, పురావస్తు స్థావరాన్ని తవ్విన వారంతా కలిసి ఈ ప్రాంతానికి సంబంధించిన నమూనాలు, సైట్ ఫొటోగ్రాఫ్‌ల సమాచారాన్ని అందించారు.