3D printed post office
3D technology Building : రోజు రోజుకు దూసుకుపోతున్న టెక్నాలజీ(technology )తో పనులు ఈజీ అయిపోతున్నాయి. ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లా..తాపీ మేస్త్రీలు అవసరం లేదు.. జస్ట్.. స్థలం చాలు.. కాంక్రీట్ మిక్సర్‌తో.. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు అంటోందీ కొత్త టెక్నాలజీ.. భవనం ఎలా కావాలో డిజైన్ చేసి.. అన్నీ ఓకే అనుకుంటే.. జస్ట్ బటన్ నొక్కితే చాలు.. ఇంటి నిర్మాణం మొదలైపోతుంది. జస్ట్.. ఓ ఫ్లెక్సీ ప్రింట్ చేసినట్టు.. ఓ పాంప్లేట్ ముద్రించినట్టు.. కాంక్రీట్‌తో ఇంటిని ప్రింట్ చేసేసి త్రీ డైమెన్షనల్ డైరెక్షన్‌లో కాంక్రీట్‌తో ఇల్లు కట్టేయొచ్చంటోంది టెక్నాలజీ.
దీంట్లో భాగంగానే బెంగళూరు(Bengaluru)లో ఓ పోస్టాఫీసు (Post Offfice)భవనం నిర్మాణమవుతోంది. త్రీడీ సాంకేతికతతో బెంగళూరులో ఇటుకలు, భారీ సంఖ్యలో కూలీలు లేకుండా 3డీ టెక్నాలజీతో పోస్టల్ భవనాన్ని (3D technology Building) నిర్మిస్తున్నారు. దీని కోసం ఇటుకలు అవసరంలేదు. కూలీలలతో పనిలేదు. అయినా భవన నిర్మాణ పనులు చకచకా అయిపోతున్నాయి.
బెంగళూరు (Bengaluru) హలసూరు పరిధిలోని కేంబ్రిడ్జ్ లేఅవుట్లో (Cambridge Layout)తపాలా కార్యాలయం కోసం ఎల్ అండ్ టీ సంస్థ పనులు చేస్తోంది. ముందుగా నిర్మాణ లేఅవుట్‌కు అనుగుణంగా కంప్యూటర్ (computer) కు కమాండ్లు ఇవ్వగా… కోబోడ్ అనే ప్రింటరు తరహా యంత్రం కాంక్రీటు మిశ్రమంతో గోడల్ని నిర్మిస్తోంది. 1,100 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. రూ.23 లక్షలతో గరిష్ఠంగా 45 రోజుల్లో భవనం సిద్ధం చేయాలని ఇంజినీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా నిర్మించే భవనాల కంటే ఈ 3డీ టెక్నాలజీ భవనం నిర్మాణానికి ఖర్చు 30-40 శఆతం తక్కువగా ఉంటుందంటున్నారు అధికారులు. అలా రూజ23 లక్షల వ్యవంతో ఈ 3డీ టెక్నాలజీ (3D printed building,)భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఈ 3డీ టెక్నాలజీ భవన నిర్మాణం గురించి కర్ణాటక సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర జనరల్ ఎస్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతు..నిర్మాణ వ్యవహాన్ని తగ్గించటానికి ఉల్సూరు బజార్ పోస్టాఫీసును కేంబ్రిడ్జ్ లేఅవుట్ కు తరలిస్తున్నామని తెలిపారు. ఆ భవన నిర్మాణానికి నెల రోజులు పడుతుందని తెలిపారు. ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లా..తాపీ మేస్త్రీలు అవసరం లేదు.. జస్ట్.. స్థలం చాలు.. కాంక్రీట్ మిక్సర్‌తో.. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు అంటోందీ కొత్త టెక్నాలజీ.. ఇల్లు ఎలా కావాలో డిజైన్ చేసి.. అన్నీ ఓకే అనుకుంటే.. జస్ట్ బటన్ నొక్కితే చాలు.. ఇంటి నిర్మాణం మొదలైపోతుంది. జస్ట్.. ఓ ఫ్లెక్సీ ప్రింట్ చేసినట్టు.. ఓ పాంప్లేట్ ముద్రించినట్టు.. కాంక్రీట్‌తో ఇంటిని ప్రింట్ చేసేస్తోంది. త్రీ డైమెన్షనల్ డైరెక్షన్‌లో కాంక్రీట్‌తో ఇల్లు కట్టిపడేస్తోంది.
దేశంలో ఈ సాంకేతికతతో గతేడాది అహ్మదాబాద్‌లో ఓ భవంతి నిర్మించగా.. ఇది రెండోదని ఇక్కడి ఇంజినీర్లు గర్వంగా చెబుతున్నారు. అహ్మదాబాద్ కంటోన్మెంట్‌లో ఇండియన్ ఆర్మీ.. సైనిక అవసరాల కోసం ఓ మోడల్ త్రీడీ హౌస్‌ను నిర్మించింది. కేవలం 12 వారాల్లో.. 71 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ హౌస్‌ను నిర్మించింది ఆర్మీ.