మంచిది : లైక్‌లు కనిపించవు

  • Publish Date - November 20, 2019 / 03:54 AM IST

సోషల్ మీడియా తెలియని వారుండరు. ఎంతో మంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ తదితర వాటిని కోట్లాను మంది ఉపయోగిస్తుంటారు. సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సైతం వీటిని ఉపయోగిస్తుంటారు. తమకు సంబంధించిన వాటిని పోస్టు చేస్తుంటారు. కొంతమంది తమ పోస్టులకు ఎన్ని లైక్‌లు వచ్చాయనే దానిపై దృష్టి పెడుతుంటారు. ఏదైనా షేర్ చేశాకా..ఎన్ని లైక్‌లు వచ్చాయి ? ఇతరులు పోస్టు చేసిన వాటికెన్ని లైక్‌లు వచ్చాయి ? అనేది చెక్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఒకవేళ వారికంటే తక్కువ వస్తే..తట్టుకోలేకపోతుంటారు. ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది ఒక మానసిక సమస్యగా మారిపోతోంది. 

దీనికి చెక్ పెట్టడం కోసం ఇన్ స్ట్రాగ్రామ్ ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వారికొచ్చే లైక్‌లు తప్ప ఇతరులకు వచ్చే వాటిని కనిపించకుండా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. కొన్ని దేశాల్లో లైక్‌లని కనిపించకుండా..చేసే వెసులుబాటు కల్పిస్తోంది. భారతదేశంలోనూ…యూజార్లకు టెస్ట్ ఆప్షన్‌ను పెట్టింది. యూజర్లు ఇన్ స్ట్రా వాల్‌పై కనిపించే టెస్టుని రన్ చేయడం ద్వారా కేవలం వారికొచ్చిన లైక్‌లు మాత్రమే చూసుకోగలుగుతారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అందిస్తున్న ఆఫ్షన్‌ని యూజర్ల నుంచి వచ్చే స్పందన ఆధారంగా పర్మినెంట్‌గా కొనగించాలా ? వద్దా ? అనే నిర్ణయాన్ని ఇన్ స్ట్రాగ్రామ్ తీసుకోనుంది.