Manoj Sharma
మహారాష్ట్ర పోలీసు శాఖలో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నుంచి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ప్రమోషన్ వచ్చింది. 12th ఫెయిల్ సినిమా వచ్చిన తర్వాత మనోజ్ కుమార్ గురించి, ఆయన నిజాయితీ గురించి దేశ వ్యాప్తంగా తెలిసింది.
ఆ సినిమాను మనోజ్ కుమార్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన విషయం తెలిసిందే. 12th ఫెయిల్ అయిన విద్యార్థి ఆ తర్వాత కష్టపడి చదివి ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడన్న స్ఫూర్తిమంతమైన కథ ఆధారంగా ఆ సినిమాను తీశారు. మనోజ్ కుమార్ పాత్రలో నటుడు విక్రాంత్ మాస్సే అద్భుతంగా నటించాడు.
తాజాగా, క్యాబినెట్ నియామకాల కమిటీ 2003, 2004, 2005 బ్యాచ్‌ల ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మనోజ్ కుమార్ శర్మకు పదోన్నతి లభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మనోజ్ కుమార్ శర్మ ట్వీట్ చేశారు.
పోలీస్ యూనిఫాంలో ఉన్న తన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఏఎస్పీ నుంచి తన ఉద్యోగ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ఐజీ అయ్యానని చెప్పారు. తనకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన జీవితం అందరికీ ఎంతో ఆదర్శవంతమని కామెంట్లు చేస్తున్నారు.
ASP से शुरू हुई यात्रा आज के भारत सरकार के ऑर्डर से IG बनने तक जा पहुँची है। इस लंबी यात्रा में साथ देने के लिए मन से सभी का आभार?? pic.twitter.com/LEITH1OVVp
— Manoj Sharma (@ManojSharmaIPS) March 15, 2024
జూన్ 2న ఫలితాలు.. 2 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు