జూన్ 2న ఫలితాలు.. 2 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు

మిగతా రెండు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, ఒడిశా) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.

జూన్ 2న ఫలితాలు.. 2 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు

Updated On : March 17, 2024 / 4:14 PM IST

అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఎన్నికల కౌంటింగ్ తేదీని జూన్ 4 నుంచి జూన్ 2కి మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ పదవీ కాలం జూన్ 2న ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. మిగతా రెండు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, ఒడిశా) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.

కాగా, లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి ఏడు దశల్లో జరుగుతాయి.

అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ఓటింగ్ జరగనుంది. 32 అసెంబ్లీ స్థానాలున్న సిక్కింలోనూ ఏప్రిల్ 19న రాష్ట్ర ఎన్నికలు జరుగుతాయి. ఒకే దశలో పోలింగ్ ఉంటుంది.