Amritpal Singh: అమృతపాల్ సింగ్‭ను పట్టుకున్నారా, అతడే లొంగిపోయాడా? అరెస్ట్‭కు ముందు అతడు ఇచ్చిన వీడియో సందేశంలో ఏముందంటే?

అరెస్టుకు ముందు అతడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అందులో తాను విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వెళ్లలేదని, తన మద్దతుదారులను హింసిస్తున్నారని, అరెస్టుకు తాను భయపడటం లేదని చెప్పాడు

Amritpal Singh: ఖలిస్థానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్‌లోని మోగా జిల్లాలో అరెస్ట్ చేసినట్టు పంజాబ్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. అయితే అతడిని నిజంగానే చేధించి పట్టుకున్నారా, లేదంటే తనకు తానుగా వచ్చి లొంగిపోయాడా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కారణం.. అరెస్టుకు ముందు అతడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అందులో తాను విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వెళ్లలేదని, తన మద్దతుదారులను హింసిస్తున్నారని, అరెస్టుకు తాను భయపడటం లేదని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే 37 రోజుల పోలీసులు, కేంద్ర బలగాళ వేట ఒట్టిదేనని, అమృతపాల్ తనకు తానుగా వచ్చి లొంగిపోయాడని అంటున్నారు.

Etala Rajender : కన్నీరు పెడుతూ కూడా సంస్కారం లేకుండా మాట్లాడినావు : రేవంత్ వ్యాఖ్యలకు ఈటల కౌంటర్

‘‘నేను పారిపోయేవాడిని కాదు, తిరుగుబాటు దారుడిని. అరెస్టుకు నేను భయపడను. నా గురువు అయిన జర్నైల్ బింద్రన్‭వాలే ఆశీస్సులు తీసుకున్న అనంతరం అరెస్ట్ అవుతాను. నా మద్దతుదారులను హింసిస్తుంటే నేను ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు. అందుకే నాకు వేరే దేశం వెళ్లే అవకాశం ఉన్నా కూడా లొంగిపోవడానికే సిద్ధమయ్యాను. గురువుల ఆశిస్సు ఉంది. తొందరలోనే నా సమూహానికి తిరిగి వస్తాను’’ అని అన్నారు. దీని ప్రకారం.. పోలీసులు అతడిని పట్టుకోవడం కాకుండా, అతడే పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Karnataka Polls: యడియూరప్పను హింసించారట.. ఆయన కన్నీళ్లే బీజేపీని ఓడిస్తాయంటున్న డీకే

దీనికి ముందు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) సుఖ్‌చైన్ సింగ్ గిల్ మాట్లాడుతూ అమృతపాల్ సింగ్ లొంగిపోలేదని, పోలీసులు అతడిని చేధించి పట్టుకున్నారని తెలిపారు. మోగా జిల్లాలోని రోడె గ్రామంలో ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం ఉందని, పోలీసులు అతను ఎటూ పారిపోయే అవకాశం లేకుండా చేశారని, తద్వారా అతనికి తప్పించుకొనేందుకు ఎలాంటి మార్గం లేకుండా పోయిందని తెలిపారు. ఆ తరువాత రోడె గ్రామం నుంచి అతన్ని ఆదివారం ఉదయం 6.45 గంటల సమయంలో ఎన్ఎస్ఏ పోలీసులు అరెస్టు చేశారని సుఖ్‌చైన్ సింగ్ గిల్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు