Nour Gillan
Israel’s Ambassador Nour Gillan : దేశంలో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదం కొనసాతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్ కు చెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. దేశం విడిచి వెళ్లి పోవాలంటూ బెదిరింపులు వచ్చిన స్క్రీన్ షాట్ ను ఆయన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ‘తక్షణమే భారత్ ను విడిచిపెట్టి వెళ్లండి, హిట్లర్ గొప్ప వ్యక్తి’ అని ట్విట్ లో ఉంది.
అయితే సందేశం పంపిన వ్యక్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని అతని గుర్తింపును దాచి పెడుతున్నట్లు నౌర్ గిల్లాన్ పేర్కొన్నారు. సదరు వ్యక్తి ప్రొఫైల్ ప్రచారం ఆయన పీహెచ్ డీ చేస్తున్నారని వెల్లడించారు.
గిలాన్ మరో ట్వీట్ లో భారత ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. తనకు భారతీయుల నుంచి చాలా మద్దతు లభిస్తుందని, ఇది తనకు చాలా మంచి అనుభూతి కల్గిస్తుందని చెప్పారు.
The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు: రాజకీయ దుమారం
సందేశాన్ని పంచుకోవడం వెనుక ఉద్దేశ్యం ఇవాల్టికీ యూదు వ్యతిరేక భావాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పడం మాత్రమేనని పేర్కొన్నారు. మనమంతా కలిసి ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలన్నారు. ద్వేష పూరిత సందేశాలు భారత్ లో స్నేహంపై ఎటువంటి ప్రభావం చూపవని ధీమా వ్యక్తం చేశారు.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై జ్యూరీ హెడ్ నాదన్ లాపిడ్ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ లో దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వాతావరణాన్ని చల్లబరిచేందుకు భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్… నదవ్ లెపిడ్ వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు.