The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు: రాజకీయ దుమారం

జమ్మూకాశ్మీర్‌ పండిట్ల ఉచకోతలు, వలసల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’(The Kashmir Files) సినిమాపై దేశవ్యాప్తంగా భిన్నరకాలుగా చర్చ జరుగుతుంది

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు: రాజకీయ దుమారం

Kashmir Files

The Kashmir Files: జమ్మూకాశ్మీర్‌ పండిట్ల ఉచకోతలు, వలసల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’(The Kashmir Files) సినిమాపై దేశవ్యాప్తంగా భిన్నరకాలుగా చర్చ జరుగుతుంది. రాజకీయ రంగు పులుముకున్న ఈ చిత్రంపై ప్రస్తుతం అటు సోషల్ మీడియాలోనూ ఇటు సామాజిక వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తూ మార్చి 11న ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం దేశ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కాశ్మీరీ హిందువుల ఊచకోత మరియు వలసల ఆధారంగా తెరకెక్కిన ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన హిందీ చిత్రాలలో సూపర్ హిట్ అయిన చిత్రంగా ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ నిలిచింది.

Also read: RRR: ‘ఎత్తర జెండా’ పాటలో అదరగొట్టిన తారక్, చరణ్!

లాభాపేక్ష లేకుండా చారిత్రక ఆధారాలను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, గోవా, త్రిపుర రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అదే సమయంలో రాజస్థాన్‌లోనూ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలంటూ బిజెపి సహా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా వసూళ్లు 3 రోజుల్లో 325% పెరిగాయి. సినిమా స్క్రీన్‌లను కూడా 600 నుంచి 2000కి పెంచారు. ‘ద కాశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా చూసేందుకు పోలీసులకు ఒకరోజు సెలవు ఇవ్వాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ రాష్ట్ర డీజీపీకి సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లాలనుకునే పోలీస్ సిబ్బందికి సెలవు ఇవ్వాల్సిందిగా హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సూచించారు.

Also read: Radhe Shyam: ఓటీటీలో రాధేశ్యామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అయితే ఈ చిత్రంపై కేరళ కాంగ్రెస్ వివాదాస్పద ట్వీట్ చేసింది. అనంతరం నిముషాల వ్యవధిలోనే దానిని తొలగించింది. “ది కాశ్మీర్ ఫైల్స్’లో చూపించినట్లుగా కాకుండా, జమ్మూ కాశ్మీర్‌లో మరణించిన వారిలో పండిట్ల కంటే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉందని కేరళ కాంగ్రెస్ ఆదివారం ట్వీట్ చేసింది. కాశ్మీరీ పండిట్ల గురించిన వాస్తవాలను, పండిట్లను టార్గెట్ చేసింది ఉగ్రవాదులే అని కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. గత 17 ఏళ్లలో (1990-2007) 399 మంది పండిట్లు ఉగ్రదాడుల్లో చనిపోగా అదే సమయంలో ఉగ్రవాదుల చేతిలో హతమైన ముస్లింల సంఖ్య 15,000గా ఉన్నట్లు కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Also read: Sikh New Rules: సిక్కులు ఇకపై ఎయిర్‌పోర్టుల్లోకి వాటిని తీసుకెళ్లొచ్చు