Radhe Shyam: ఓటీటీలో రాధేశ్యామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. లాక్‌డౌన్ తర్వాత రికార్డు కలెక్షన్లు సాధించిన..

Radhe Shyam: ఓటీటీలో రాధేశ్యామ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Will Bollywood Help Out Radhe Shyam

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. లాక్‌డౌన్ తర్వాత రికార్డు కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. డివైడ్ టాక్‌ ఉన్నప్పటికీ ఈ సినిమాకు తొలి రోజు నుండే వసూళ్ల హవా కొనసాగిస్తుంది. తొలి మూడు రోజులలోనే రాధేశ్యామ్ సినిమా రూ.150 కోట్ల భారీ వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ పోస్టర్ల ద్వారా ప్రకటించారు. కాగా మరో రెండు వారాలు భారీ సినిమాలు లేకపోవడం ఈ సినిమాకి ఇంకా కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది.

Radhe Shyam: సాలిడ్ రన్ ఖాయం.. రాధే శ్యామ్ రిజల్ట్ ఇదే!

కాగా.. రాధేశ్యామ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. రాధేశ్యామ్‌ రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, అందులోనే ప్రభాస్‌ మూవీ కావడంతో పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు భారీ ధరలను చెల్లిస్తామని పోటీ పడుతున్నాయట. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్ భారీ ధరకు రాధేశ్యామ్‌ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.

Radhe Shyam: భీమ్లా నాయక్‌ను టచ్ చేయలేకపోయిన రాధేశ్యామ్!

ఓటీటీలకు భారీ ఆదరణ నేపథ్యంలో సినిమా థియేటర్లలో ఉండగానే ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఏ సినిమా అయిన థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం 4 వారాల తర్వాత డిజిటల్‌ ప్లాట్‌ఫాంకు వస్తుంది. ఆ లెక్కన చూస్తే.. రాధేశ్యామ్‌ ఏప్రిల్‌ 11 తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే, అంతకు ముందే ఏప్రిల్‌ 2న ఉగాది పండగ నేపథ్యంలో అదే రోజు రాధేశ్యామ్ సినిమా స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో పుష్ప సినిమాని కూడా ముందే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.