Radhe Shyam: సాలిడ్ రన్ ఖాయం.. రాధే శ్యామ్ రిజల్ట్ ఇదే!

భారీ బడ్జెట్.. పాన్ ఇండియా లెవెల్.. నాన్ స్టాప్ ప్రమోషన్స్ తో రాధేశ్యామ్ రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొచ్చిన రాధేశ్యామ్..

Radhe Shyam: సాలిడ్ రన్ ఖాయం.. రాధే శ్యామ్ రిజల్ట్ ఇదే!

Radheshyam

Radhe Shyam: భారీ బడ్జెట్.. పాన్ ఇండియా లెవెల్.. నాన్ స్టాప్ ప్రమోషన్స్ తో రాధేశ్యామ్ రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేసింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొచ్చిన రాధేశ్యామ్ ఊహించినట్టే నంబర్ గేమ్ చూపిస్తోంది. అయితే ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? మేకర్స్ రియాక్షన్ ఏంటి? ఇలాంటి రాధేశ్యామ్ ట్రెండీ అప్ డేట్స్ పై ఓ లుక్.

Radhe Shyam: భీమ్లా నాయక్‌ను టచ్ చేయలేకపోయిన రాధేశ్యామ్!

వరల్డ్ వైడ్ రాధేశ్యామ్ హంగామా సృష్టిస్తోంది. ఫ్యాన్స్ తో పాటూ లవ్ సబ్జెక్ట్స్ ను ఎంజాయ్ చేసే ప్రేక్షకులను బాగానే అట్రాక్ట్ చేస్తున్నాడు గ్లోబల్ స్టార్. దాదాపు వరల్డ్ వైడ్ 203 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన రాధేశ్యామ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అక్షరాల 79 కోట్లు.. ఓవర్సీస్ లోనే మూడువేలకు పైగా థియేటర్స్ లో పదకొండు వేల స్క్రీన్స్ లో రిలీజ్ అయిన రాధేశ్యామ్..సాలిడ్ బుకింగ్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సో కలెక్షన్ల లెక్కలు చూస్తుంటే ప్రభాస్ కి సాలిడ్ హిట్ దక్కినట్టే కనిపిస్తోంది.

Radhe Shyam: రాధేశ్యామ్‌ను వాళ్లు గట్టెక్కిస్తారా?

యాక్షన్ సీన్స్, భారీ విలనిజం, మాస్ హై ఇంటెన్స్ సీన్స్ ఉండవని ముందే చెప్పేసారు డైరెక్టర్ రాధాకృష్ణ. గత ప్రభాస్ సినిమాలకు భిన్నంగా లవర్ బాయ్ గా కనిపిస్తారని ఆల్రెడీ హింట్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా థియేటర్స్ కి వెళ్తోన్న ఆడియెన్స్ కి సూపర్బ్ గా కనెక్ట్ అవుతోంది రాధేశ్యామ్. అందరూ అనుకున్నట్టే ట్రైన్ సీక్వెన్స్, క్లైమాక్స్.. ఆడియెన్స్ ను సీట్ ఎజ్డ్ పై కూర్చోబెడుతోంది.

Radhe Shyam: ప్రభాస్ లుక్స్‌పై ఫ్యాన్స్ కామెంట్స్!

సక్సెస్ ఫుల్ రన్ దక్కించుకున్న రాధేశ్యామ్ థ్యాంక్స్ మీట్ డైరెక్టర్ రాధాకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాల్గొన్నారు. పామిస్ట్ క్యారెక్టర్ కి ప్రభాస్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసారని.. కొన్ని సీన్స్ కు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఎమోషనల్ గా అనిపిస్తుందన్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ. ఇక రాధేశ్యామ్ బాగుంది కాబట్టే బిజిఎమ్ అంత బాగా కుదిరిందని, ప్రేమతో చూస్తే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తమన్ రియాక్టయ్యాడు.