Radhe Shyam: రాధేశ్యామ్‌ను వాళ్లు గట్టెక్కిస్తారా?

స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.

Radhe Shyam: రాధేశ్యామ్‌ను వాళ్లు గట్టెక్కిస్తారా?

Will Bollywood Help Out Radhe Shyam

Radhe Shyam: స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా తొలి ఆటకే డివైడ్ టాక్ రావడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ఆందోళనలో పడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి సీన్ మనకు ‘సాహో’ చిత్రం సమయంలో కూడా కనిపించింది. ఆ సినిమాకు తెలుగునాట సేమ్ రిజల్ట్ రావడంతో అది కలెక్షన్ల పరంగా బాగా వెనకబడిపోయింది.

Radhe Shyam: రాధేశ్యామ్‌లో ఆయన మిస్సింగ్.. ఏమై ఉంటుంది?

దీంతో ఇప్పుడు రాధేశ్యామ్ పరిస్థితి కూడా సాహో తరహాలోనే సాగనుందా అనే ఆందోళన చిత్ర యూనిట్‌లో నెలకొంది. అయితే సాహో చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా, బాలీవుడ్ జనాలు మాత్రం ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో నార్త్‌లో సాహో చిత్రం అదిరిపోయే కలెక్షన్లు రాబట్టి ఎలాగోలా గట్టెక్కింది. కానీ ఇప్పుడు రాధేశ్యామ్ పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. ఆ సినిమాతో పోలిస్తే, ఈ సినిమాలో ఎలాంటి భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు లేకపోవడం పెద్ద మైనస్ అని చెప్పాలి.

Radheshyam : సినిమా రిలీజ్ అయితే మాకు 100 టికెట్స్ ఇవ్వాలి.. విజయవాడ మేయర్ లేఖ..

సాహో చిత్రంలోని బైక్ ఛేజ్ వంటి యాక్షన్ సీక్వెన్స్‌లు బాలీవుడ్ జనాలకు బాగా ఎక్కాయి. అందుకే వారు ఆ సినిమాను అనుకున్న దానికంటే బాగా ఆదరించారు. కానీ రాధేశ్యామ్ పరిస్థితి వేరు. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా లేదు. కేవలం హిందీ వర్షన్ పాటలు మాత్రమే అక్కడి ఆడియెన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి. మరి ఈ సినిమాకు అక్కడి జనం ఎలాంటి రిజల్ట్‌ను కట్టబెడతారా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.

Radhe Shyam: రెబల్ స్టార్ రేంజ్.. ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డ్!

తెలుగు రాష్ట్రాల్లో రాధేశ్యామ్‌కు కష్టాలు తప్పవని సినీ క్రిటిక్స్ చెబుతుండటంతో, ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ చూపంతా నార్త్ ఆడియెన్స్‌పైనే ఉంది. మరి అక్కడి బి,సి సెంటర్ ఆడియెన్స్ రాధేశ్యామ్‌ను ఆదుకుంటారా లేక మాస్ అంశాలు లేవని ఈ సినిమాను పక్కనబెడతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఏదేమైనా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన రాధేశ్యామ్ ఇలాంటి రిజల్ట్‌ను మూటగట్టుకోవడం ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందనే చెప్పాలి.