Radhe Shyam: రాధేశ్యామ్‌లో ఆయన మిస్సింగ్.. ఏమై ఉంటుంది?

నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.

Radhe Shyam: రాధేశ్యామ్‌లో ఆయన మిస్సింగ్.. ఏమై ఉంటుంది?

Krishnam Raju Not Seen In Radhe Shyam

Radhe Shyam: నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దాదాపు మూడేళ్ల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బొమ్మ థియేటర్లలో పడుతుండటంతో ఆయన అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించడంతో ఈ మూవీ ఎలాంటి ట్రీట్ ఇస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమా మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.

Radheshyam : సినిమా రిలీజ్ అయితే మాకు 100 టికెట్స్ ఇవ్వాలి.. విజయవాడ మేయర్ లేఖ..

ఇక రాధేశ్యామ్ కోసం ఇండియన్ ఆడియెన్స్ ఏ విధంగా ఎదురుచూశారో, ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా అదే స్థాయిలో ఎదురుచూశారు. అయితే థియేటర్లకు వెళ్లిన అక్కడి ఆడియెన్స్‌కు చిత్ర యూనిట్ ఓ భారీ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పరమహంస’ అనే సాధువు పాత్రలో కృష్ణం రాజు మనకు ఈ సినిమాలో కనిపిస్తాడని.. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలి మరీ చెప్పుకొచ్చింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో ఈ పాత్రను తెలుగులో కృష్ణంరాజుతో చేయించారు చిత్ర యూనిట్.

Radheshyam : రాధేశ్యామ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదానికి గురైన అభిమాని..

కానీ మిగతా భాషల్లో ఈ పాత్రలో మరో నటుడు సత్యరాజ్‌ను తీసుకున్నారు. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమా తెలుగు వర్షన్‌లో ‘పరమహంస’ పాత్రలో కృష్ణంరాజు కాకుండా సత్యరాజ్ కనిపించేసరికి అక్కడి ఆడియెన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. తెలుగు వర్షన్‌లో కృష్ణంరాజు లేకపోవడంతో ఈ సినిమా మొత్తంలో కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు. గతంలో ప్రభాస్ నటించిన బిల్లా, రెబల్ వంటి సినిమాల్లో కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. దీంతో ముచ్చటగా మూడోసారి వీరిద్దరినీ ఒకేసారి స్క్రీన్‌పై చూడాలని ఓవర్సీస్ ఆడియెన్స్ ఆశించారు.

Pooja Hegde : ‘రాధేశ్యామ్’ రిజల్ట్ ఎలా ఉన్నా.. అంటూ పూజాహెగ్డే ట్వీట్

అయితే రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లారని చెప్పాలి. కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉన్న ప్రింట్స్‌లోనే తెలుగు వర్షన్‌లో మనకు కృష్ణంరాజు కనిపిస్తున్నాడట. ఓవర్సీస్‌కు చిత్ర యూనిట్ పంపిన ప్రింట్స్‌లో కృష్ణంరాజు ప్లేస్‌లో సత్యరాజ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విధంగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ఎందుకు చేసిందనేది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కడం లేదని ఓవర్సీస్ ఆడియెన్స్ అంటున్నారు. ఏదేమైనా యంగ్ రెబల్ స్టార్, రెబల్ స్టార్‌లను మరోసారి ఒకే స్క్రీన్‌పై చూడాలని అనుకున్న ఓవర్సీస్ ఆడియెన్స్‌కు నిరాశే మిగిలిందని చెప్పాలి. మరి ఈ విషయంపై రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.