Radheshyam : రాధేశ్యామ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదానికి గురైన అభిమాని..

దాదాపు 'సాహో' సినిమా వచ్చాక మూడేళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఆనందంలో ఉన్నారు రాధేశ్యామ్ రిలీజ్ కి థియేటర్లని దగ్గరుండి ముస్తాబు చేశారు. భారీ...

Radheshyam : రాధేశ్యామ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదానికి గురైన అభిమాని..

Radheshyam (3)

 

Radheshyam :   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా ‘రాధేశ్యామ్’ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ లో, కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 200 కోట్లకు పైగా జరిగింది. ఇప్పటికే సినిమా ఒక విజువల్ వండర్ అని చూసిన వారంతా చెప్తున్నారు. అద్భుతమైన లవ్ స్టోరీకి మరింత అద్భుతమైన విజువల్స్ ని జత చేసి సినిమాని చిత్రీకరించారని అభిమానులు అంటున్నారు.

దాదాపు ‘సాహో’ సినిమా వచ్చాక మూడేళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఆనందంలో ఉన్నారు రాధేశ్యామ్ రిలీజ్ కి థియేటర్లని దగ్గరుండి ముస్తాబు చేశారు. భారీ భారీ కటౌట్స్ పెట్టారు. ఇక ప్రభాస్ కి తెలుగుతో పాటు వేరే భాషల్లో కూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఓ థియేటర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది.

Indraja : పెళ్లైనా మగాడిని మగాడిగానే చూస్తారు.. ఓ ఆడదాన్ని మాత్రం.. నటి ఇంద్రజ వ్యాఖ్యలు..

గుంటూరులోని కారంపూడి ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద అపశృతి చోటు చేసుకుంది. థియేటర్‌ వద్ద 37 ఏళ్ల చల్లా కోటేశ్వరరావు అనే ప్రభాస్ అభిమాని ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్‌ తీగలపై పడింది. దీంతో ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరికీ కూడా గాయాలు అయ్యాయి.