Radhe Shyam: ప్రభాస్ లుక్స్‌పై ఫ్యాన్స్ కామెంట్స్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Radhe Shyam: ప్రభాస్ లుక్స్‌పై ఫ్యాన్స్ కామెంట్స్!

Fans About Prabhas Looks

Radhe Shyam: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తిగా పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించడంతో, ఇందులో ప్రభాస్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక రాధేశ్యామ్ రిలీజ్ అయిన అన్ని చోట్లా.. మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరగడంతో ఈ వీకెండ్ వరకు రాధేశ్యామ్ హౌజ్‌ఫుల్ బోర్డ్స్‌తో దర్శనమివ్వనుంది.

Radhe Shyam: రాధేశ్యామ్‌లో ఆయన మిస్సింగ్.. ఏమై ఉంటుంది?

అయితే, ఈ సినిమా చూసిన డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం రాధేశ్యామ్‌లో తమ అభిమాన హీరో లుక్స్ చూసి తట్టుకోలేకపోయారు. ఈ సినిమాను దాదాపు మూడేళ్లుగా చిత్రీకరిస్తుండటంతో.. ప్రభాస్ ఈ సినిమాలో వారు ఊహించినంత అందంగా కనిపించలేదట. కొన్ని సీన్స్‌లో ప్రభాస్ ముఖం మరీ నీరసంగా, మరికొన్ని సీ‌న్స్‌లో ఆయన ముఖం వయసు మీదపడినట్లుగా కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అటు ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కూడా ఏమాత్రం పర్ఫెక్ట్‌గా లేకపోవడంతో వారు ఈ సినిమాలో చూస్తున్నది తమ అభిమాన హీరోనేనా అనే సందేహం వారిలో నెలకొందట.

Radheshyam : రాధేశ్యామ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదానికి గురైన అభిమాని..

ప్రభాస్ ముఖం మాత్రమే కాదు కొన్ని షాట్స్‌లో ఆయన డైలాగ్ డెలివరీ కూడా చాలా నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ బాగా అప్‌సెట్ అయ్యారట. అసలు ప్రభాస్ తన లుక్స్, బాడీ లాంగ్వేజ్‌పై ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదని వారు వాపోయారు. ఇకనైనా తమ అభిమాన హీరో తన లుక్స్‌పై శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని వారు ఈ సందర్భంగా ప్రభాస్‌ను కోరుతున్నారు.

Radheshyam : రాధేశ్యామ్ సినిమాలో వాటికే 75 కోట్లు ఖర్చు..

కాగా రాధేశ్యామ్ చిత్రం కంటే ముందే సాహో చిత్రంలో కూడా ప్రభాస్ లుక్స్‌పై అప్పట్లో కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే ప్రభాస్ ఏళ్ల తరబడి ఒకే సినిమా కోసం పనిచేస్తుండటంతో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఆయన ఇకపై జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదని కొందరు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఆయనకు సలహాలిస్తున్నారు.