Radhe Shyam: భీమ్లా నాయక్‌ను టచ్ చేయలేకపోయిన రాధేశ్యామ్!

రాధేశ్యామ్.. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు.

Radhe Shyam: భీమ్లా నాయక్‌ను టచ్ చేయలేకపోయిన రాధేశ్యామ్!

Radhe Shyam Collections In Nizam

Radhe Shyam: రాధేశ్యామ్.. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. పూర్తిగా పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు కె.రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్మిస్ట్ పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమాకు రిలీజ్ రోజునే మిక్సిడ్ టాక్ రావడం, ప్రభాస్ సినిమాలో ఎక్స్‌పెక్ట్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఏమీ లేకపోవడంతో అభిమానులు ఉసూరుమంటూ థియేటర్ల నుండి బయటకు వచ్చారు.

Radhe Shyam: రాధేశ్యామ్‌ను వాళ్లు గట్టెక్కిస్తారా?

వీటి ప్రభావం చిత్ర కలెక్షన్లపై బాగానే పడినట్లుగా తెలుస్తోంది. డార్లింగ్ సినిమాలో కేవలం రొమాంటిక్ ఎపిసోడ్స్‌నే పెట్టి, యాక్షన్‌ను పక్కనపెట్టడం ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఈ సినిమా చూసిన వారు పెదవి విరుస్తున్నారు. అయితే సినిమా ఫస్ట్ డే టికెట్ బుకింగ్స్ ఎప్పుడో జరిగిపోవడంతో ఈ సినిమాకు తొలి రోజున భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి. కానీ నెగెటివ్ టాక్ ఈ సినిమా కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం చూపడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాకు తొలిరోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 30 కోట్ల రూపాయల మేర వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నైజాం ఏరియాలో ఈ సినిమాకు తొలి రోజున రూ.10.45 కోట్ల మేర షేర్ వసూళ్లు దక్కాయి. ఈ లెక్కన రాధేశ్యామ్ చిత్రం తొలి రోజు కలెక్షన్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ను టచ్ చేయలేకపోయిందని తెలుస్తోంది.

Radhe Shyam: రాధేశ్యామ్‌లో ఆయన మిస్సింగ్.. ఏమై ఉంటుంది?

నైజాం ఏరియాలో తొలిరోజు వసూళ్లలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రానికి రూ.11.44 కోట్లు రాగా.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రానికి రూ.11.85 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ రెండు సినిమాలను అందుకోవడంలో రాధేశ్యామ్ వెనకబడిపోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కేవలం ఈ వీకెండ్ వరకు మాత్రమే రాధేశ్యామ్ సాలిడ్ కలెక్షన్స్‌ను రాబడుతుందని.. మండే నుండి ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోవడం ఖాయమని వారు అంటున్నారు. ఏదేమైనా స్లోగా సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీకి ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.