Sikh New Rules: సిక్కులు ఇకపై ఎయిర్‌పోర్టుల్లోకి వాటిని తీసుకెళ్లొచ్చు

సిక్క్ కమ్యూనిటీకి చెందిన ఏవియేషన్ సెక్టార్ ఉద్యోగులకు ఖడ్గం తీసుకెళ్లొచ్చంటూ అనుమతులిచ్చింది ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యూలేటర్ బీసీఏఎస్. ఈ మేరకు స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.

Sikh New Rules: సిక్కులు ఇకపై ఎయిర్‌పోర్టుల్లోకి వాటిని తీసుకెళ్లొచ్చు

Civil Aviation

Sikh New Rules: సిక్క్ కమ్యూనిటీకి చెందిన ఏవియేషన్ సెక్టార్ ఉద్యోగులకు ఖడ్గం తీసుకెళ్లొచ్చంటూ అనుమతులిచ్చింది ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యూలేటర్ బీసీఏఎస్. ఈ మేరకు స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) మార్చి4న రిలీజ్ చేసిన ఆర్డర్ ప్రకారం.. సిక్ ఏవియేషన్ సెక్టార్ ఉద్యోగులు ఖడ్గాన్ని ఇండియన్ ఎయిర్ పోర్టు పరిసరాల్లోకి తీసుకెళ్లడాన్ని నిషేదించారు. దీనిని శిరోమణీ గురుద్వారా పర్బంధక్ కమిటీ తప్పుబట్టింది.

ఎట్టకేలకు మార్చి 12న బీసీఏఎస్ నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఒంపు తిరిగిన ఖడ్గం సిక్కు మతస్థులు ధరించొచ్చని అందులో పేర్కొన్నారు.

మార్చి 4న విడుదల చేసిన ఆర్డర్ లో.. ‘ఖడ్గాన్ని సిక్కు ప్యాసింజర్లు మాత్రమే తీసుకెళ్లాలి. అది కూడా దాని ఉంటే పదునైన భాగం ఆరు అంగుళాలకు మించి ఉండకూడదు. మొత్తం ఖడ్గం తొమ్మిది అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉండటానికి వీల్లేదు’ అని రాసి ఉంది.

Read Also: సిక్కు మతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి స్కూల్ అడ్మిషన్ నిరాకరణ

అది కూడా ఇండియా ఎయిర్ పోర్టుల్లో, దేశీయ విమాన సర్వీసుల్లో మాత్రమే అనుమతించారు. ఈ నిబంధనలతో సిక్కు ప్యాసింజర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కానీ, సిక్కు ఉద్యోగులకు లేవని విమర్శలు వెల్లవెత్తాయి.

మార్చి 9న ఎస్జీపీసీ ప్రెసిడెంట్ హర్జేందర్ సింగ్ ధామీ సివిల్ ఏవియేషన్ మినిష్టర్ జ్యోతిరాదిత్యా సింధియాకు లేఖ రాశారు. మార్చి 4 ఆర్డర్ అనేది సిక్కుల హక్కులపై పోరాడినట్లుగా ఉందని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మార్చి 12న బీసీఏఎస్ మార్చి 4ఆర్డర్ సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.