కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం 

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు.

  • Publish Date - April 16, 2019 / 07:26 AM IST

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు.

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. మందిర్, మదిర్ ప్రాంతాల్లోని నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున డబ్బు సిద్ధం చేశారన్న సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. గతంలో మంత్రి రేవణ్ణ పుట్టణ్ణ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం రేవణ్ణ పుట్టణ్ణతోపాటు ఆయన అనుచరులు, బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 
Read Also : మరో నలుగురు ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ

ఓటర్లకు అధికంగా డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. దేవేగౌడ మనువడు వంద కోట్ల రూపాయలను తన అనుచరుల ఇళ్లలో దాచి పెట్టాడని…అలాగే సుమలత రూ. 50 కోట్లు పంచేందుకు అక్కడున్నట్లు ఉదయం సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హాసన్ లో మూడు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐటీ దాడులు కక్ష్యపూరితంగా జరుగుతున్నాయని జేడీఎష్ నేతలు ఆరోపిస్తున్నారు. 

దేవేగౌడ మనుమళ్లు నిఖిల్ గౌడ, ప్రజ్వల్.. మాండ్య, హాసన్ నియోజకవర్గాల నుంచి జేడీఎస్ తరపున బరిలో నిలిచారు. మరోవైపు మాండ్య నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో నేటితో ప్రచారం ముగియనుంది.
Read Also : యువతి ఆత్మహత్యా యత్నం: వేధింపులే కారణం

ట్రెండింగ్ వార్తలు