Encounter
Encounter : జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో భద్రతా వలయం నుంచి పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్ లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. షోపియాన్ జిల్లాలోని ఛోటిగామ్ ప్రాంతంలో కాల్పులు ప్రారంభమైనట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ లో తెలిపారు.
ALSO READ : Ram Janmabhoomi temple : అయోధ్య రామ మందిరంలో హైటెక్ భద్రతకు రూ.90కోట్లతో కవచ్
షోపియాన్ జిల్లాలోని ఛోటిగామ్ ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయని, షోపియాన్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఎన్ కౌంటరులో పాల్గొన్నారని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్‌లో తెలిపారు. కుల్గాం జిల్లాలోని హడిగాం గ్రామంలో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగిన రెండు రోజుల తర్వాత షోపియాన్‌లో ఈ సంఘటన జరిగింది.
ALSO READ : Prime Minister Narendra Modi : లక్షద్వీప్ ప్రెస్టిన్ బీచ్‌లో మోదీ సాహస స్విమ్మింగ్
భద్రతాబలగాలు ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.